Home » సమంత వేసుకునే చెప్పుల వెనుక కూడా ఇంత స్టోరీ ఉందా?

సమంత వేసుకునే చెప్పుల వెనుక కూడా ఇంత స్టోరీ ఉందా?

by Srilakshmi Bharathi
Ad

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేక పరిచయాలేమీ అవసరం లేదు. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తరువాత కూడా సమంత తిరిగి తన సినీ ప్రయాణాన్ని కొనసాగించింది. వరుసగా సినిమాలు చేసినప్పటికీ సక్సెస్ రేట్ తగ్గిందనే చెప్పాలి. ఇది ఇలా ఉంటె, సెలెబ్రెటీలకు సంబంధించి ప్రతి విషయమూ హైలైట్ అవుతూనే ఉంటుంది.

samantha

Advertisement

తాజాగా సమంత వేసుకునే చెప్పుల గురించి కూడా టాక్ నడుస్తోంది. సెలెబ్రిటీల లైఫ్ స్టైల్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అందరికి తెలిసిన విషయమే. అయితే.. మరీ చెప్పుల విషయంలో కూడా ఇలా ఉంటారా అని అనిపిస్తుంది సమంత వేసుకునే చెప్పుల కాస్ట్ ఎంతో తెలిస్తే. సమంత వేసుకునే చెప్పుల ధర రెండు లక్షల 58 వేల 97 రూపాయలు. ఇంత కాస్ట్లీ చెప్పులు వేసుకోవడం ఎందుకు అని అనిపిస్తోంది కదా.

Advertisement

సోషల్ మీడియాలో నెటిజన్స్ సైతం ఇదే ఆశ్చర్యపోతున్నారు. ఇంత ఖరీదైన చెప్పులను ధరించాల్సిన అవసరం ఏముంది? ఎంత డబ్బు ఎక్కువైతే మరీ ఇలానా? అని చెవులు కొరుక్కుంటున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే.. సమంత ఇటీవలే మాయోసైటిస్ వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ వ్యాధికి చికిత్స తీసుకునే ఇటీవలే కోలుకున్నారు. కాగా, ఈ వ్యాధి బారిన పడ్డ వారికి అరికాళ్ళు సున్నితంగా మారిపోతాయట. అందుకే వైద్యులు మెత్తని చెప్పులు ధరించాల్సిందిగా సూచించారట. ప్రస్తుతం ఆమె చెప్పులు వేసుకుని తిరుగుతున్నా ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

మరిన్ని ముఖ్య వార్తలు:

 

Visitors Are Also Reading