ప్రస్తుతం సమాజంలో చాలా మంది ప్రజలు ఆరోగ్యం పై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొంత మంది మాత్రం ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే వారు ఇప్పటికైనా ప్రతిరోజు డ్రై నట్స్ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. అవి మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంటాయి. నట్స్ లో విటమిన్ ఈ, ఒమెగా 3, ఒమెగా 6 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. మెదడు పని తీరును చాలా మెరుగ్గా చేస్తాయి.
Advertisement
ప్రతీ రోజు వీటిని తీసుకుంటే గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ప్రతిరోజు వాల్ నట్స్ తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిలో ఎక్కువ మొత్తంలో ప్రోటీన్, ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిలో చాలా ఎక్కువ మొత్తంలో ప్రోటీన్, ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వుతో పాటు యాంటి ఆక్సిడెంట్లు వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడంతో పాటు గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. గట్ మైక్రోబయోటాపై ప్రభావం కారణంగా వాల్ నట్స్ హృదయనాళ ప్రయోజనాలను కలిగించడానికి సహాయపడుతాయి.
Advertisement
Also Read : స్త్రీలు ఆ రోజుల్లో తలంటూ స్నానం చేయరాదు.. అలా చేస్తే అంతా దరిద్రమే..!
పాలీఫెనాల్స్, విటమిన్ ఇ, ఒమెగా 3, ఒమేగా 6 యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. వీటిని తినడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ఎందుకు అంటే ఇవి ఒత్తిడి తగ్గించి మెదడుకు మేలు చేస్తాయి. వాల్ నట్స్ బరువును తగ్గించడంలో కూడా సహాయపడుతాయి. వాల్ నట్స్ తినడం వల్ల శరీరంలో క్యాన్సర్ కణాల అభివృద్ధి ఆగిపోతుందని. అదేవిధంగా వాల్ నట్స్ ను తింటే రక్తంలో చక్కెర స్థాయి తగ్గి డయాబెటిస్ అదుపుల ఉంటుంది. అదేవిధంగా టైప్ 2 డయాబెటిస్ సంబంధం ఉన్న ఇతర అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. 100 గ్రాముల వాల్ నట్స్‌లో 15 గ్రాముల ప్రోటీన్ శాతం లభిస్తుంది. వీటిలో ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ ఆమ్లం ఉంటుంది. వాల్ నట్స్‌లో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. వాల్ నట్స్ తీసుకోవడం ద్వారా గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో ప్రయోజనకరంగా ఉంటుందని పరిశోధకులు సూచిస్తున్నారు.
Also Read : మీ భాగస్వామికి మీపై ఎంత ప్రేమ ఉందో తెలియాలంటే.. ఈ 5 విషయాలపై ఓ లుక్కేయండి..!!