Home » ఏపీలో షర్మిలతో కాంగ్రెస్ కొత్త ప్లాన్..!

ఏపీలో షర్మిలతో కాంగ్రెస్ కొత్త ప్లాన్..!

by Sravya
Ad

ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కొత్త వ్యూహాలని ముందుకు తీసుకొస్తుంది. వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపించాలని భావిస్తోంది. కాంగ్రెస్లో చేరిన షర్మిల కి రాజ్యసభ ఖాయం అయ్యింది. కర్ణాటక నుండి రాజ్యసభ కి పంపడంతో పాటు ఏపీలోని కీలక బాధ్యతలను ఇవ్వాలని నిర్ణయించారు. ఏపీలో నష్టపోయిన పార్టీకి తిరిగి పూర్వ వైభవం తీసుకురావడానికి బాధ్యతని అప్పగించారు. అయితే ఇప్పుడు ఆమె కీలకంగా మారబోతున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్లో చేరిన షర్మిల భవిష్యత్తు అడుగులు ఏ విధంగా ఉంటాయని చర్చ అయితే సాగుతోంది. షర్మిల కాంగ్రెస్ అధ్యక్షులు ఖర్గేతో సమావేశం అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చే విధంగా పనిచేయాలని సూచించారు.

Ys sharmila Into Congress party

Advertisement

Advertisement

ఆమెకి పీసీసీ పగ్గాలు అప్పగించాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారని ఎక్స్పెక్టేషన్స్ కి అనుగుణంగా పనిచేయాలని కోరారు. ఏపీలో కర్ణాటక నుండి షర్మిల కి రాజ్యసభ సీటు ఇచ్చేందుకు కూడా సుముఖత వ్యక్తం చేశారు. అవసరమైన కార్యాచరణ ప్రణాళికను కూడా రూపొందించాలని ఇతర పార్టీల నుండి చేరికల పైన ఫోకస్ పెట్టాలని సూచించారు ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే విధంగా కృషి చేయాలని షర్మిల పేర్కొన్నారు. ఏ బాధ్యతలు అప్పగించిన స్వీకరించడం కి రెడీగా ఉన్నానని దీనిపై చర్యలు జరుగుతున్నాయని ఒకటి రెండు రోజుల్లో క్లియర్ గా తెలుస్తోంది అని షర్మిల అన్నారు.

ys sharmila

ys sharmila

అలానే తన కొడుకు పెళ్ళికి రావాల్సిందిగా షర్మిల పార్టీ పెద్దలను కూడా ఆహ్వానించారు. ఏపీ పీసీసీ అధ్యక్షుడు రుద్రరాజు తో సహా పార్టీ నేతలతో సమావేశం అయ్యారు తర్వాత అవసరమైన పిసిసి పదవి త్యాగానికి సిద్ధమని రుద్రరాజు షర్మిల కి పిసిసి చీఫ్ బాధ్యతలు అప్పగించాలని రాహుల్ భావిస్తున్నారు. సిద్ధంగా ఉండాలని సమాచారం వచ్చింది ఈ నెలాఖరులో ప్రియాంక ని ఆహ్వానించి అమరావతి వేదికగా సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading