Home » మోడీ సర్కార్ పదేళ్ల పాలన పై కాంగ్రెస్ బ్లాక్ పేపర్..!

మోడీ సర్కార్ పదేళ్ల పాలన పై కాంగ్రెస్ బ్లాక్ పేపర్..!

by Sravya
Ad

ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకు వస్తున్న శ్వేత పత్రానికి ప్రతిగా కాంగ్రెస్ పార్టీ బ్లాక్ పేపర్ తీసుకురావడానికి సిద్ధమైంది. నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్రం పదేళ్ల పాలనపై కాంగ్రెస్ బ్లాక్ పేపర్ ప్రస్తావని కి రాబోతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బ్లాక్ పేపర్ ని తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ పదేళ్ల ఆర్థిక పనితీరుని బిజెపి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వ పదేళ్ల ఆర్థిక పనితీరుకి శ్వేత పత్రాన్ని విడుదల చేస్తామని ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

Advertisement

modi

Advertisement

పార్లమెంట్లో 2024 – 25 మధ్యంతర బడ్జెట్ ని ప్రవేశపెట్టిన నిర్మల సీతారామన్ 2014లో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం ఆ సంవత్సరాల సంక్షోభాన్ని అధికమించిందని చెప్పారు. 2014 వరకు మనం ఎక్కడున్నాము..? ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం అని చూడడానికి కేంద్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి అన్నారు. అయితే ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ బ్లాక్ పేపర్ ని తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది మల్లికార్జున్ ఖర్గే బ్లాక్ పేపర్ ని తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading