సాధారణంగా రాజకీయాల్లో రెండు పార్టీలకు చెందిన రాజకీయ నాయకుల మధ్య విభేదాలు ఉంటాయి. అదే విధంగా సినిమా ఇండస్ట్రీలో కూడా కొన్నిసార్లు సినీ ప్రముఖుల మధ్య చిన్నచన్న విభేదాలు వచ్చి గొడవలు జరుగుతుంటాయి. ఇలాంటి గొడవలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ లాగా మారిపోతుంటాయి.
Advertisement
ఇంకా అప్పట్లో సంగీత దర్శకుడు వేటూరి, కళాతపస్వి కె.విశ్వనాథ్ మధ్య విభేదాలు వచ్చాయి. ఇండస్ట్రీలో ఈ విభేదాలు సంచలనంగా మారిపోయాయి. ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఉషా సినిమాలో సంగీతం కి ఎంత ప్రాధాన్యత ఉంటుందో ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సంగీత భరితమైన సినిమాలను తెరకెక్కించి బ్లాక్బస్టర్ విజయాలను కూడా అందుకున్నారు. సంగీతానికి కేరాఫ్ అడ్రస్ గా ఉన్నారు వేటూరి. శంకరాభరణం సప్తపది శుభలేఖ, సాగర సంగమం లాంటి సినిమాలు దర్శకత్వం లో వేటూరి సంగీతం లో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. సాగర సంగమం తర్వాత వేటూరి కళాతపస్వి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో వేటూరి విశ్వనాథ్ సినిమాలకు పని చేయడమే మానేశారు.
Advertisement
ఆ తర్వాత కె.విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన స్వాతి మత్యం సినిమా కు ఆత్రేయ సాహిత్యాన్ని అందించారు. ఈ సినిమాలో మనసు పలికే పాటను కొత్తవాడైనా సిరివెన్నెల సీతారామ శాస్త్రి కి అవకాశం ఇచ్చారు. కే.విశ్వనాథ్ సినిమాలో ఆయన పాట నచ్చడంతో ఆ తర్వాత సిరివెన్నెల సినిమాలో పూర్తి పాటలు సీతారామ శాస్త్రి కే రాసే అవకాశం ఇచ్చారు. సిరివెన్నెల సినిమా సూపర్ హిట్ అవడంతో సిరివెన్నెల ఆయన ఇంటిపేరు గానే మారిపోయింది.
ఆ తర్వాత చాలా కాలానికి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన స్వరాభిషేకం లో వేటూరి సిరివెన్నెల కలిసి సాహిత్యం అందించారు. ఈ సినిమాలో పాటలు రామజోగయ్యశాస్త్రి కూడా అందించడం గమనార్హం. వేటూరి విశ్వనాథ్ మధ్య ఉన్న విభేదాలు చిత్ర పరిశ్రమకు సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి లాంటి వారు పరిచయమయ్యారు.
Also Read : Viral Video : పోటీ పడీ మరీ జిమ్నాస్టిక్ చేస్తున్న కుక్కలు..!