ఉక్రెయిన్ రష్యా భీకర స్థాయిలో దాడులకు తెగబడుతోంది. నేపథ్యంలో రష్యా చర్యలను ప్రపంచ దేశాలు తప్పుబడుతున్నాయి. అటు రష్యా కూడా ఎప్పుడూ ఏమి జరుగుతోంది తెలియక సతమతం అవుతోంది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో రష్యా ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్న వస్తువు ఏమైనా ఉందంటే.. అది కండోమ్ అని ఆ దేశపు ప్రముఖ ఆన్లైన్ రీటెయిలర్ వైల్డ్ బెర్రీస్ వెల్లడించింది. గత సంవత్సరం ఇదే సమయంతో పోల్చితే ప్రస్తుతం రష్యాలో కండోమ్ అమ్మకాలు 170 శాతం పెరిగాయి అని వివరించింది.
Also Read : Mahesh Babu ఒక్కడు సినిమాలోని చార్మినార్ సెట్ కు పెట్టిన ఖర్చు ఎంతంటే?
Advertisement
Advertisement
రష్యా ప్రజలు కండోమ్‌లను అధికంగా కొనుగోలు చేయడానికి ఓ కారణం ఉంది. ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా రష్యాపై అమెరికా సహా పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి. ఈ తరుణంలో కండోమ్‌ల ధరలు విపరీతంగా పెరుగుతాయనే భయం రష్యన్ ప్రజల్లో పెరిగింది. ఈ కారణంగానే కండోమ్ విక్రయాలు ఆదేశంలో ఆకాశాన్ని అంటుతున్నాయి.
మరొక వైపు పశ్చిమ దేశాల ఆంక్షల వల్ల రష్యా కరెన్సీ విలువ డాలర్, యూరో లతో పోల్చితే తగ్గుతోంది. ఈ కారణంగా కండోమ్‌ల ధరలు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ప్రజలు కండోమ్‌లను భవిష్యత్ అవసరాల కోసమే కొంటున్నారని, రానున్న కాలంలో కండోమ్‌లు కొనలేని ధరకు చేరుతాయని ప్రజలు భావిస్తున్నారని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read : అమల ఏ దేశానికి చెందిన మహిళనో తెలుసా…ఆమె తల్లి ఎవరంటే…!