Telugu News » Blog » అమ‌ల ఏ దేశానికి చెందిన మ‌హిళ‌నో తెలుసా…ఆమె త‌ల్లి ఎవ‌రంటే…!

అమ‌ల ఏ దేశానికి చెందిన మ‌హిళ‌నో తెలుసా…ఆమె త‌ల్లి ఎవ‌రంటే…!

by AJAY
Published: Last Updated on

టాలీవుడ్ స్టార్ హీరోల‌లో నాగార్జున ఒక‌రు. హీరోగా స‌క్సెస్ అయిన‌ నాగార్జ‌న సినిమాల‌కు ఎంత స‌క్సెస్ అయ్యారో ఫ్యామిలీకి కూడా ఆయ‌న అంతే ప్రాధాన్య‌త ఇస్తుంటారు. త‌న భార్య అమ‌లతో నాగార్జున్ ఎంతో అన్యోన్యంగా ఉంటార‌న్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికీ కూడా నాగార్జున త‌న పుట్టిన‌రోజును అమ‌ల‌తో క‌లిసే జ‌రుపుకుంటారు. ఇదిలా ఉంటే అమ‌లా కూడా ఒక‌ప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగారు.

 

కానీ పెళ్లి త‌ర‌వాత మాత్రం కుటుంబ జీవితానికి పూర్తి ప్రాధాన్య‌త ఇస్తూ సినిమాల‌ను ప‌క్క‌న పెట్టేశారు. 1986 లో మిథిలి ఎన్నై కాథిలి అనే సినిమాతో అమ‌ల ఇంట‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వ‌డంతో ఓవ‌ర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయారు. ఆ త‌ర‌వాత వ‌రుస ఆఫ‌ర్ లు అందుకున్నారు. తెలుగు, తమిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో హీరోయిన్ గా న‌టించారు.

అంతే కాకుండా నాగార్జున‌ను పెళ్లి చేసుకోక‌ముందే అమల యాబై సినిమాల్లో హీరోయిన్ గా న‌టించి అల‌రించారు. ఇక నాగార్జున అమ‌ల‌ల‌ది ప్రేమ వివాహం అన్న సంగ‌తి తెలిసిందే. వీరిద్ద‌రి కాంబినేషన్ లో శివ‌, నిర్ణ‌యం లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలు వ‌చ్చాయి. ఇక ఈ రెండు సినిమాల షూటింగ్ స‌మ‌యంలోనే నాగార్జున అమ‌ల‌తో ప్రేమ‌లో ప‌డ్డార‌ట‌. కానీ నాగార్జున‌కు అప్ప‌టికే ద‌గ్గుబాటి వెంక‌టేష్ సోద‌రితో వివాహం జ‌రిగింది.

కానీ నాగార్జున అమ‌ల‌ను ప్రేమించిన వెంట‌నే భార్య‌తో విడాకులు తీసుకున్నారు. అంతే కాకుండా అమ‌ల‌ను వివాహం చేసుకున్నారు. అయితే అమ‌ల బ్యాగ్రౌండ్ విషయానికి వ‌స్తే ఆశ్చ‌ర్యం క‌లుగుతుంది. అమ‌ల తండ్రి బెంగాలీ కాగా ఆమె త‌ల్లి ఐర్లాండ్ దేశ‌స్తురాలు. అమ‌ల త‌ల్లిదండ్ర‌లు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇక‌ అమ‌ల తండ్రి నేవీ ఆఫీస‌ర్ కావ‌డంతో వాళ్ల ఫ్యామ‌లీ చెన్నై, వైజాగ్ లలో ఉండేవారు.

Also Read: Mahesh Babu ఒక్క‌డు సినిమాలోని చార్మినార్ సెట్ కు పెట్టిన ఖ‌ర్చు ఎంతంటే?

Also Read: Today rasi phalalu in telugu : ఆ రాశి వారు ఒత్తిడి పెర‌గ‌కుండా చూసుకోవాలి

You may also like