నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు రాజకీయాల్లో రాణిస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నారు. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడంతో టీడీపీ బాధ్యతలు చూసుకుంటున్నాడు. మరోవైపు బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమాను దసరా పండుగ సందర్భంగా ఈనెల 19న విడుదల కాబోతుంది. దీనికి సంబంధించి అన్ని కార్యక్రమాలను నిర్మాతలు పూర్తి చేస్తున్నారు.
Advertisement
అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ RRR మూవీ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 05 విడుదల కాబోతుందని ఇటీవలే దర్శకుడు కొరటాల శివ ప్రకటించారు. దేవర రెండు పార్ట్ లు ఉంటుందని కూడా వెల్లడించారు. బాలకృష్ణ సినిమా అక్టోబర్ 19, ఎన్టీఆర్ సినిమా ఏప్రిల్ 05న విడుదలవుతుంటే వీరిద్దరి మధ్య పోటీ ఎందుకు ఉంటుందని చాలా మందికి డౌట్ రావచ్చు. కానీ భగవంత్ కేసరి మూవీ విడుదల రోజునే జూనియర్ ఎన్టీఆర్ నటించిన అదుర్స్ మూవీని రీ రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఈనెల 19నే విడుదల చేస్తున్నామని.. ఆ సినిమా నిర్మాతలు కానీ, దర్శకుడు కానీ ఎక్కడా ప్రకటించలేదు. కానీ సోషల్ మీడియాలో మాతరం వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు నందమూరి అభిమానులు కూడా ఒకేరోజు బాబాయి-అబ్బాయి సినిమాలు ఎలా వస్తాయని ప్రశ్నిస్తున్నారు.
Advertisement
ఇది అంతా ఫేక్ న్యూస్ అని కొందరూ కొట్టి పారేస్తున్నారు. అదుర్స్ మూవీకి మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నిర్మాతలు. ప్రస్తుతం వీరిద్దరూ రాజకీయంగా బాలకృష్ణకు చాలా వ్యతిరేకంగా ఉంటారు. అందుకే బాలయ్య సినిమా విడుదల రోజునే విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన వల్లభనేని వంశీ వైసీపీకి అనుబంధ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. టీడీపీ, చంద్రబాబుతో కొడాలి నాని, వంశీల వైరం బహిరంగ రహస్యమే. బాలకృష్ణకు వ్యతిరేకంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారంటున్నారు. అలాంటిది ఏమి లేదని కొందరూ అభిమానులు కొట్టి పారేస్తున్నారు. ఒకవేళ ఇది కనుక వాస్తవం అయితే ఎన్టీఆర్ జోక్యం చేసుకొని రెండింటి మధ్య పోటీ లేకుండా చూడాలని.. అసలే అంతంతమాత్రంగా ఉన్న సంబంధాలు మరింత క్షీణిస్తాయనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏం జరుగుతుందనేది వేచి చూడాల్సిందే.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
రోజాను ట్రోల్ చేస్తే తప్పు.. రజనీని ట్రోల్ చేస్తే తప్పు కాదా..?