తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ కమెడీన్ లలో సుధాకర్ ఒకరు. చాలా సినిమాలలో ఆయన ప్రేక్సకులను కడుపుబ్బ నవ్వించారు. తెరపై నవ్వులను పంచి ప్రేక్షకులకు ఆయుష్షు పెంచిన సుధాకర్ ఇప్పుడు వయస్సు పైబడటం.. ఆరోగ్యం అంతగా సహకరించకపోవడంతో ఇంట్లోనే ఉంటున్నారు. లప్ఫాం గిరి గిరి, టేచల్ టేచల్ వంటి డైలాగ్ లు చెప్పి ప్రేక్షకులను అలరించేవారు. నవ్వుతూ అందరినీ నవ్విస్తూ సినీ ఇండస్ట్రీలో దాదాపు 45 ఏళ్లపాటు ఆడియన్స్ మనసులను దోచుకున్న సుధాకర్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
సుధాకర్ పవిత్ర ప్రేమ, చక్రవర్తి, యుముడికి మొగుడు, రాజా, ఒంటరిపోరాటం, స్టేట్ రౌడీ, కొదమ సింహం, మజ్ఞు, రాజా విక్రమార్క, పవిత్ర బంధం, బొంబాయి ప్రియుడు, పెళ్లిపందిరి, పెళ్లి చేసుకుందాం,సుస్వాగతం.. ఇలా చెప్పుకుంటూ పోతే వందలాది సినిమాల్లో నటించారు. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేశారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున తదితరులతో కలిసి నటించారు. ఇటీవల సుధాకర్ గురించి కొన్ని ఫేక్ న్యూస్ వచ్చాయి. సుధాకర్ మరణించాడంటూ.. కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేశాయి. అది చూసి తనపై వచ్చిన దుష్ప్రచాారాన్ని తట్టుకోలేకపోయాడు. ‘నేను బతికే ఉన్నాను మొర్రో.. నా నవ్వు ఇంకా ఆగలేదు’ అంటూ ఓ వీడియో కూడా విడుదల చేశాడు.
Advertisement
జూన్ 18న ఫాదర్స్ డే సందర్భంగా జీ తెలుగులో ‘నేను నాన్న’ అన్న ప్రత్యేక కార్యక్రమంలో సుధాకర్ కనిపించారు. వయస్సు పైబడి ఓపిక లేకపోయినప్పటికీ డైలాగ్ చెప్పే ప్రయత్నం చేశారు. చెమ్మగిల్లిన కళ్లతో ఉన్న సుధాకర్ కి హ్యాపీ ఫాదర్స్ డే డాడీ అని తన కొడుకు కేకు తినిపించాడు. అబ్బబ్బా.. అంటూ తన డైలాగ్ తో నవ్వించేశారు. కమెడీయన్ గానే కాకుండా నిర్మాతగా, హీరోగా కూడా పని చేశాడు సుధాకర్. యముడికి మొగుడు, తాతయ్య పెళ్లి మనవడి శోభనం వంటి సినిమాలకు నిర్మాతగా పని చేశారు. సుధాకర్ కి ప్రస్తుతం 64 సంవత్సరాలు. ఎప్పటికీ ఇలాగే నవ్వుతూ.. నవ్విస్తుండాలని కోరుకుందాం.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ఈ సన్నివేశాన్ని గమనించారా..?
సమంతతో ఉన్న రిలేషన్ పై ప్రీతమ్ జుకాల్కర్ ఆసక్తికర కామెంట్స్..!