సాధారణంగా కొత్త సినిమా వచ్చిందంటే ఇదివరకు సినిమా టికెట్లను ఎక్కువగా బ్లాక్‌లో అమ్మేవారు. ఇప్పుడు పరిస్తితి మారిపోయింది. ఎల్లుండి కొత్త సినిమా విడుదల కానుంది. గోపిచంద్, రాశీఖన్నా హీరో, హీరోయిన్లుగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం పక్కా కమర్షియల్. అల్లుఅరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం జులై 01న విడుదలవ్వనుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన టికెట్లను బ్లాక్‌లో అమ్ముతూ దొరికిపోయాడు కమెడియన్ సప్తగిరి. ఈ చిత్రంలో కమెడియన్ సప్తగిరి తన నవ్వులతో ప్రేక్షకులను ఆకట్టుకోనున్న విషయం తెలిసిందే. సప్తగిరి బ్లాక్‌లో టికెట్లు అమ్ముతూ దర్శకుడు మారుతికి దొరుకుతాడు. ఆ తరువాత సప్తగిరి మారుతి చివాట్లు పెట్టిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
జులై 01న ఈ సినిమా విడుదల కానున్ననేపథ్యంలో టికెట్ ధరలపై ప్రేక్షకుల్లో సందేహం నెలకొంది. అయితే పక్కా కమర్షియల్ సినిమా టికెట్ ధరలు ఎలా ఉండబోతున్నాయని ప్రతి ఒక్కరూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా టికెట్ల ధరలపై క్లారిటీ ఇచ్చేందుకు చిత్ర బృందం కొత్తగా ఇలా ప్లాన్ చేసింది. గీత ఆర్ట్స్ తమ యూట్యూబ్ చానల్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో సప్తగిరి బ్లాక్ టికెట్లు అమ్ముతూ దర్శకుడికి కనిపిస్తాడు. అప్పుడు మారుతి సప్తగిరిని ఏంటి బ్లాక్‌లో టికెట్లను అమ్ముతున్నావా..? అని అడగగా సినిమాల్లోకి రాకముందే చిరంజీవి సినిమాలకు ఇదే పని చేసేవాడిని అని సప్తగిరి చెప్పాడు. ఇప్పుడు ఒక టికెట్ ఎంతకు అమ్ముతున్నావని అడగ్గా రూ.150 అని సప్తగిరి సమాధానం చెబుతాడు.
దీనికి డైరెక్టర్ మారుతి కౌంటర్‌లో కూడా ఇదే ధరకు ఇస్తున్నారు కదా.. అంటాడు మారుతి. అది విని సప్తగిరి పాత ధరలకే సినిమాను ప్రదర్శిస్తున్నారా అని అడుగుతాడు. ఈ చిత్రాన్ని నాన్ కమర్షియల్ ధరలకే అందుబాటులో ఉంచుతున్నట్టు నిర్మాత బన్నివాసు మూవీ ప్రమోషన్లలో చెబుతున్నాడు కదా.. అది వినలేదా..? అని అడగ్గా అవునా సార్ అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు సప్తగిరి. పక్కా కమర్షియల్ సినిమా మిమ్మలందరినీ మళ్లీ పాత థియేటర్ల వైభవం రోజులకు తీసుకెళ్లేందుకు సందడిగా హ్యాపీగా నవ్వుతూ మూవీని ఎంజాయ్ చేసేందుకు పాత ధరలకు ఈ సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ సినిమాను ప్రతి ఒక్కరూ చూసి ఎంజాయ్ చేయండి అని మారుతి చెప్పుకొచ్చాడు.
Also Read :
“మాస్టర్” సినిమా క్లైమాక్స్ లో డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఇచ్చిన ఈ హింట్ గమనించారా…?
మీ పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోయి బాధపడుతున్నారా..? అయితే టిప్స్ మీ కోసమే..!