Home » “మాస్టర్” సినిమా క్లైమాక్స్ లో డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఇచ్చిన ఈ హింట్ గమనించారా…?

“మాస్టర్” సినిమా క్లైమాక్స్ లో డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఇచ్చిన ఈ హింట్ గమనించారా…?

by AJAY
Ad

లోకేష్ నాగరాజ్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. ఖైదీ సినిమా కు ముందు లొకేష్ కనకారాజ్ పేరు చాలా తక్కువ మందికి తెలుసు. కానీ ఖైదీ సినిమా వచ్చిన తర్వాత లోకేష్ కనకరాజ్ ఎంతో పాపులర్ అయ్యారు. దర్శకుడిగా లోకేష్ కనకరాజ్ అందరి హీరోల దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. అంతేకాకుండా తమిళ స్టార్ హీరో విజయ్ తో మాస్టర్ సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు. కానీ మాస్టర్ సినిమా అనుకున్న మేర విజయం సాధించలేదు.

Advertisement

ఈ సినిమాపై ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉండడం…. సినిమాలో ఓవర్ గా హీరో ఎలివేషన్ సీన్ లు ఉండటంతో ప్రేక్షకులు నిరాశ చెందారు. కానీ ఈ సినిమా తర్వాత లోకేష్ కనకరాజ్ విక్రమ్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో కమల్ హాసన్ హీరోగా నటించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది.

Advertisement

ఈ సినిమాకు భారీ స్థాయిలో కలెక్షన్స్ వస్తున్నాయి. విక్రమ్ సినిమాతో కేవలం సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ లోనూ లోకేష్ కనకరాజ్ కు క్రేజ్ పెరిగిపోయింది. అంతేకాకుండా ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కమల్ హాసన్ కు విక్రమ్ సినిమాతో హిట్ కూడా పడింది.

ఇదిలా ఉంటే లోకేష్ కనకరాజ్ సినిమాలు ఖైదీ, మాస్టర్, విక్రమ్ అన్నింటికీ ఒక లింక్ ఉంటుందని చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై లోకేష్ కనకరాజ్ ముందే తన సినిమాలలో కూడా హింట్ కూడా ఇచ్చాడు. ఆ హింట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఖైదీ సినిమాలో కానిస్టేబుల్ పాత్రలో నటించిన ఓ నటుడు మాస్టర్ సినిమా క్లైమాక్స్ లోను జైలు వద్ద కనిపిస్తాడు. దాంతో ఖైదీ మాస్టర్ సినిమాలకు లింక్ ఉందని కోలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది.

Visitors Are Also Reading