Home » అందరిని నవ్వించిన కమెడియన్ లెజెండ్ రాజబాబు చివరి రోజుల్లో ఇంతటి నరకాన్ని అనుభవించారంటే ?

అందరిని నవ్వించిన కమెడియన్ లెజెండ్ రాజబాబు చివరి రోజుల్లో ఇంతటి నరకాన్ని అనుభవించారంటే ?

by Srilakshmi Bharathi
Ad

ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి.. స్టార్ కమెడియన్ గా ఎదిగి, కోట్ల ఆస్తిని ఆర్జించిన కమెడియన్ లెజెండ్ రాజబాబుని తెలుగు ప్రేక్షకులు అంత త్వరగా మర్చిపోలేరు. ఆయన ఎంత గొప్ప జీవితాన్ని అనుభవించినా.. జీవితం చరమాంకానికి వచ్చేసరికి ఎక్కడ మొదలు పెట్టారు అక్కడికే వెళ్లి.. అంత్య కాలాన్ని మాత్రం అనేక ఇబ్బందులతో గడిపారు.

rajababu-and-krishna

Advertisement

రాజబాబు అసలు పేరు అప్పల్రాజు. ఆయన సినిమాల్లోకి వచ్చేసరికి ఆయన పేరుని రాజబాబు గా మార్చుకున్నారు. పుణ్యమూర్తుల వారి ఇంటిపేరు. దాన్ని సార్ధకం చేసుకుంటూనే జీవితాంతం వరకు లేదనకుండా దాన ధర్మాలు చేస్తూనే ఉన్నారు.

 

ఆయనకు ముగ్గురు తమ్ముళ్లు, ఐదుగురు అక్క చెల్లెల్లు. ఇంటి పెద్ద అయినా.. బాధ్యతల్లో మాత్రం ఆఖరివాడిలా ఉండేవారట. తండ్రి మాట విని చదువుకునే బుద్ధిమంతుడిలా కాకుండా.. తనకి నచ్చిన పనిని మాత్రమే చేస్తానని మొండి ఘటం ఆకతాయిల ఉండేవాడట మన రాజబాబు.

అర్ధరాత్రి ఇంట్లో మస్కా కొట్టి నాటాకాలు వేయడానికి వెళ్లేవాడట. అలా తండ్రి చేతిలో దెబ్బలు తిన్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఎలాగోలా చదువు పూర్తి చేసి.. టీచర్ ఉద్యోగం సంపాదించాడట.

ఉద్యోగం పేరుతొ ఇంటి నుంచి బయటకు వచ్చి.. టీచర్ ఉద్యోగం చేసుకుంటూనే నాటకాలు కూడా వేసేవారట. అలా సినిమాల్లో అవకాశం వచ్చింది. తన వైవిధ్యమైన బాడీ లాంగ్వేజ్ కూడా సినిమాల్లో కమెడియన్ గా క్లిక్ అవ్వడానికి ఓ కారణం. ఇరవై ఇళ్లల్లోనే ఆరువందల సినిమాల్లో నటించిన ఘనత రాజబాబుది.

ఇక సీనియర్ నటులతో కూడా ఆయన ఎంతో ప్రేమగా మెలిగేవారట. మహానటి సావిత్రిని కూడా అక్కా అక్కా అని పిలుస్తూ ఎంతో సన్నిహితంగా ఉండేవారట. ఆమె కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే కాదు.. డౌన్ అయ్యినప్పుడు కూడా రాజబాబు సావిత్రి గారితో అదే ఆప్యాయతను చూపించేవారట. ఇక దాన ధర్మాల విషయంలో ఎముక లేని చెయ్యి అని పేరు ఉండేది.

ఇక డబ్బుని ఖర్చు పెట్టె విషయంలో కూడా చాలా విరివిగా ఖర్చు చేసేవాడు. ఎవరైనా ఆపద అని వస్తే చాలు వారు చెప్పేది నిజమో కాదో కూడా చూడకుండా డబ్బు ఇచ్చేసేవాడు. ఇటువంటి ధోరణ వలన ఎన్ని కోట్ల ఆస్తి సంపాదించినా అది హారతి కర్పూరంలా కరిగిపోయింది. దానికి తోడు తాగుడు కూడా అలవాటు అయ్యింది. వీటన్నితో వేగలేక అతని భార్య రాజబాబుని వదిలేసి వెళ్ళిపోయింది.

దీనితో మరింత కృంగిపోయిన రాజబాబు అలవాట్లు మానలేక, మరింత తాగుతూ సినిమాలపై ధ్యాస తగ్గించి మత్తులో మునిగి తేలాడు. ఫలితంగా డబ్బు కరిగిపోయి రోగాలు మిగిలాయి. ఆయనకు నలభై ఏళ్ల వయసులో కాన్సర్ బయటపడింది. ఆయనకు గొంతు కాన్సర్ వచ్చింది. చివరి దశకి వచ్చేసరికి రాజబాబు తన తమ్ముడిని పిలిచి.. సినిమాలు చేసుకోమని చెప్పి.. తాను మాత్రం తన తల్లితండ్రుల వద్దకు వెళ్ళిపోయాడు. పుట్టినపుడు ఎలా తల్లి దగ్గర ఉన్నాడో.. అలానే తల్లితోనే సపర్యలు చేయించుకుంటూ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading