Home » నటుడు నూతన్ ప్రసాద్ గురించి ఈ ఒక్క విషయం మీకు తెలుసా..?

నటుడు నూతన్ ప్రసాద్ గురించి ఈ ఒక్క విషయం మీకు తెలుసా..?

by Sravanthi
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలనాటి నటుడు నూతన్ ప్రసాద్ మంచి పేరు సంపాదించుకున్నారు. హాస్యం తో ఎంతోమందిని మంత్రముగ్ధుల్ని చేసేవారు. ఈయన కమెడియన్ గానే కాకుండా ప్రతినాయకుడి పాత్రలో కూడా నటించి మెప్పించారు. ఆయన హైదరాబాదులో చదువుకునే రోజుల్లో సినిమా ఆఫర్లు వచ్చాయి.. ఆ తర్వాత నటనా చాతుర్యంతో దూసుకెళ్ళాడు. ఇండస్ట్రీ లో ఆయనకు ఒక ప్రత్యేకమైన పేరు ఉండేది. నూటొక్క జిల్లాల అందగాడు అని పిలిచేవారు.

Advertisement

also read:అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన 12 సినిమాల్లో స‌గం బ్లాక్‌బ‌స్ట‌ర్లే అనే విష‌యం మీకు తెలుసా ?

HAL లో ఈయన ఉద్యోగం చేసే సమయంలో రంగస్థల నటుడు దర్శకుడు భానుప్రసాద్ పరిచయం అయ్యాడు. భాను ప్రసాద్ స్థాపించిన కళారాధన సంస్థ ద్వారా కొన్ని నాటకాల్లో చేశాడు నూతన్ ప్రసాద్. ఉద్యోగం మరోవైపు నాటకాల్లో చేస్తూ వస్తున్న నూతన ప్రసాద్ ,1973 లో తన ఉద్యోగానికి స్వస్తి పలికి ఏఎన్నార్ నటించిన అందాల రాముడు సినిమా ద్వారా ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత చాలా సినిమాలు చేశారు కానీ అంతగా గుర్తింపు లభించలేదు. దాని ముత్యాలముగ్గు సినిమాలో రావు గోపాల్ రావు తో పాటుగా ఈయన కూడా విలన్ పాత్ర చేయడంతో మంచి గుర్తింపు లభించింది.

Advertisement

ఇక అప్పటి నుంచీ చాలా చిత్రాలలో విలన్ పాత్రలు చేస్తూ వచ్చారు. ఆయన విలన్ పాత్రలు చేస్తూనే అందులో కామెడీని పండించేవారు. అప్పటివరకు అగ్రహీరోలు గా ఉన్న ఎన్టీఆర్, ఏఎన్నార్,కృష్ణ తో విలన్, కమెడియన్ గా, వివిధ పాత్రల్లో నటించారు నూతన్ ప్రసాద్. 1984 నంది అవార్డు కూడా వచ్చింది. అలాగే 2005లో ఎన్టీఆర్ పురస్కారం కూడా లభించింది. నూతన్ ప్రసాద్ 365 సినిమా బామ్మ మాట బంగారు బాట షూటింగ్ జరుగుతున్న సమయంలో ప్రమాదం జరిగి తీవ్రంగా గాయపడి అప్పటి నుంచి సినిమాలు మానేసి నటనకు దూరంగా ఉంటున్నారు.

also read:

Visitors Are Also Reading