Home » మహేష్ బాబు సినిమాల్లో ఈ కామన్ పాయింట్ ను గుర్తించారా….!

మహేష్ బాబు సినిమాల్లో ఈ కామన్ పాయింట్ ను గుర్తించారా….!

by AJAY
Ad

కొంతమంది హీరోల సినిమాలలో కొన్ని కామన్ పాయింట్స్ కనిపిస్తూ ఉంటాయి. వాటిని కావాలనే చేస్తారా లేదంటే సాధారణంగానే అలా జరిగిపోతాయా అన్నది మాత్రం చెప్పలేం. అయితే ఇప్పుడు ఏం చేసినా చాలా జాగ్రత్తగా చేయాలి.

Advertisement

లేదంటే మీమర్స్ కు దొరికిపోతారు ట్రోల్స్ బారిన పడతారు. ఇప్పుడు తాజాగా మహేష్ బాబు సినిమాలోనూ ఓ కామన్ పాయింట్ మీమర్స్ కు దొరికిపోయింది.

అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా మహేష్ బాబు సినిమాలో పాటలు చాలా బాగుంటాయి అన్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా మహేష్ బాబు సినిమాలో పాటలు ఎంతో కలర్ ఫుల్ గా కూడా ఉంటాయి. ఇదిలా ఉంటే మహేష్ బాబు దూకుడు సినిమాలో అన్ని పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. అయితే ఈ సినిమాలో ఓ పాటలో సమంత పక్కన ఉండే సైడ్ డ్యాన్సర్ కు అంతా ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తుంటారు.

Advertisement

Mahesh babu

Mahesh

నిజానికి ఫారిన్ అమ్మాయిలను ఎవరైనా గ్లామర్ గా చూపించాలని అనుకుంటారు. కానీ మహేష్ బాబు సినిమా లో మాత్రం ఫారిన్ అమ్మాయిలు గ్లామర్ లుక్ లో చిట్టి పొట్టి బట్టలతో కాకుండా ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తూ ఉంటారు. అయితే అది కేవలం దూకుడు సినిమాలో మాత్రమే కనిపిస్తే ఎవరూ పట్టించుకోరు. కానీ మహేష్ బాబు హీరోగా నటించిన ఆగడు సినిమాలో కూడా హీరోయిన్ పక్కన నటించే లేడీ డ్యాన్సర్స్ అంతా ఫారిన్ వాళ్ళే….వాళ్లంతా ట్రెడిషనల్ లుక్ లోనే కనిపిస్తుంటారు.

Also read : CM గా ఉండి NTR న‌టించిన సినిమా! షూటింగ్ స్పాట్ కే ఫైల్స్!!

ఈ రెండు సినిమాలే కాదు. మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలోని ఓ పాట వీడియో క్లిప్ ను తాజాగా విడుదల చేసారు. ఈ సినిమాలోని పాటలో కూడా లేడీ డ్యాన్సర్స్ ఫారిన్ వాళ్లే కాగా వాళ్లంతా ట్రెడిషనల్ లుక్ కనిపిస్తున్నారు.

Visitors Are Also Reading