మెగా ఫ్యామిలీలో అగ్గి రాజేసుకుందా అంటే అవుననే సమాధానమే వస్తోంది. ముఖ్యంగా రాజకీయం కోసం, ఆధిపత్యం కోసం గ్రూప్స్ గా విడిపోయారు అనే సందేహాలు మొదలయ్యాయి. ప్రధానంగా కొన్ని సోషల్ మీడియా పోస్టులు కూడా ఆ అనుమానాలకు బీజం వేశాయి. మెగా ఫ్యామిలీలో మనస్పార్థాలు, వివాదాలు కొత్త ఏమి కాదు. ఆర్థిక, రాజకీయ కారణాలతో మెగా బ్రదర్స్ కి చిన్న చిన్న గొడవలు చోటు చేసుకున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పటికీ ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు చిరంజీవి. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ తప్పుబట్టారు. చిరంజీవి తన అన్న అని కూడా చూడకుండా బహిరంగ విమర్శలు చేశాడు. తమ్ముడి ఆరోపణలను సున్నితంగా చిరంజీవి ఖండించారు. పవన్ కి ఆవేశం ఎక్కువ, అవగాహన తక్కువ అని నవ్వుతూ మీడియా ముందు వాపోయాడు.
Advertisement
అదేవిదంగా ఆరేంజ్ మూవీ నిర్మాతగా మొత్తం కోల్పోయిన నాగబాబుని చిరంజీవి ఆదుకోలేదనే వాదన ఉంది. అప్పుల్లో కూరుకుపోయిన నాగబాబుకి తమ్ముడు పవన్ కొంతలో కొంత అయినా సాయం చేశాడట. పవన్ తనకు ఆర్థిక సహాయం చేసినట్టు నాగబాబు స్వయంగా రెండు సందర్భాల్లో వెల్లడించాడు. ఆలోచన విధానంలో కూడా చిరంజీవి తమ్ముళ్లు నాగబాబు, పవన్ కళ్యాణ్ పూర్తి విరుద్ధంగానే ఉంటారు. అన్న జీవితం ఇచ్చాడనే కృతజ్ఞత భావం ఎక్కడో గుండె లోతుల్లో ఉన్నప్పటికీ.. అయిష్టం అనే నెగిటివ్ ఫీలింగ్ తమ్ముళ్లలో బలంగానే ఉంది. అప్పుడప్పుడూ పరోక్షంగా బయటికీ వస్తుంటుంది. రాజకీయ వేదికలపై పవన్ తనని ఓ సాధారణ కానిస్టేబుల్ కొడుకుగా చెప్పుకోవడం ఇందుకు నిదర్శనం.
తనకంటూ ఓ స్టార్‌డమ్ వచ్చాక తాను చిరంజీవి అనే వటవృక్షం కింద ఎదిగిన వాడిగా ఒప్పుకోవడానికి పవన్ ఇష్టపడడం లేదు. ఇక తన రాజకీయ ప్రత్యర్థులతో చిరంజీవి సన్నిహితంగా ఉండడం పవన్, నాగబాబులకు అసలు నచ్చడం లేదు. జనసేన పార్టీ బలం కాపు సామాజిక వర్గం. రాష్ట్రంలో అత్యధిక ఓటు బ్యాంకు కలిగిన ఆ సామాజిక వర్గం అండగా ఉంటుందనే ఆశల పునాదిపై కట్టిన పార్టీ. కాపు సామాజిక వర్గాన్ని ఏకతాటి పైకి తేవడం ద్వారా ఏపీ రాజకీయాల్లో నిర్ణయాత్మకంగా ఎదగాలనేది పవన్ కల. ఈ తరుణంలోనే చెగువేరా సిద్ధాంతాలు సైతం పక్కన పెట్టి కుల ఫీలింగ్ గురించి ఓపెన్ అయ్యారు. కనీసం క్యాస్ట్ ఫీలింగ్ తో అయినా జనసేనకు మద్దతు ఇవ్వాలని కోరాడు. కాపు సామాజిక వర్గాన్ని జనసేవ వైపునకు తిప్పుకోవాలని పవన్, నాగబాబు ఇన్ని తంటాలు పడుతుంటే.. చిరంజీవి జగన్‌తో దోస్తీ చేస్తున్నాడు. కీలక వేదికలపై కలిసి కూర్చుంటున్నాడు.
Advertisement
చిరంజీవి కారణంగా జగన్‌కి కాపుల్లో మరింత మద్దతు పెరగవచ్చని వాళ్ల భయం. జగన్ చిరంజీవిపై చూపించే సోదరభావం ఎవడికీ కావాలి. అక్కరకు రాని సోదరభావం ఎందుకు అని.. పవన్ రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో అసహనం ప్రదర్శించిన విషయం అందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఓ వారం రోజులుగా నాగబాబు సోషల్ మీడియాలో చేసే పోస్టులు కాకరేపుతున్నాయి. నేను అంత తేలికగా ఎవడినీ వదులుకోను.. వదులుకున్నానంటే వాడికంటే వెదవ ప్రపంచంలో ఉండడంటూ ఓ పోస్ట్ చేశాడు. ఇది సన్నిహితులను ఉద్దేశించి చేసిన కామెంట్ అనేది స్పష్టంగా అర్థమవుతోంది. తాజా పోస్ట్‌లో మరింత ఘాటైన కామెంట్ చేశాడు.
మంచి వాడు శత్రువులకు కూడా సాయం చేస్తాడు. చెడ్డవాడు తోడబుట్టిన వాళ్లను కూడా ముంచుతాడు. మంచి వాళ్లను దూరం చేసుకుంటే ముంచే వాళ్లు దగ్గరవుతారని.. ఓ సోషల్ మీడియా పోస్ట్ చేశాడు. ఇక్కడ తోడబుట్టిన వాళ్లను ముంచుతున్న ఆ అన్న ఎవరనేది పెద్ద చర్చగా మారింది. జనసేనకు దూరంగా ఉంటున్న చిరంజీవిని ఉద్దేశించే నాగబాబు ఈ కామెంట్ చేశారని పలువురు అభిప్రాయ పడుతున్నారు. నాగబాబు చేసిన పోస్ట్‌లో అన్న చిరంజీవినే టార్గెట్ గా కామెంట్స్ చేశారని అన్నదమ్ముల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని స్పష్టమవుతోంది.
ఇక అదే సందర్భంలో జనసేన పార్టీలో తనకు సముచిత స్థానం ఇవ్వడం లేదని పవన్ ని విమర్శిస్తూ నాగబాబు ఈ కామెంట్ చేశారనే తెరపైకి మరో కోణం కూడా వస్తుంది. అదేవిదంగా తాత అల్లు రామలింగయ్యను తలచుకుంటూ అల్లు అర్జున్ ఓ పోస్ట్ చేశారు. మా పునాది అని కూడా కామెంట్ చేయడం విశేషం. తన ఎదుగుదలకు స్టార్‌డమ్ కి అల్లు తాతయ్యే కారణం అన్నట్టు అల్లు అర్జున్ పోస్ట్ ఉంది. దీనిపై మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అల్లు అర్జున్ అంటూ సపరేట్ ఇమేజ్, ఫ్యాన్ బేస్ కోరుకుంటున్న అల్లు అర్జున్ ఉద్దేశపూర్వకంగానే ఈ పోస్ట్ చేశారని పేర్కొంటున్నారు. అల్లు అర్జున్ మెగా హీరో ఇమేజ్ వద్దు అంటున్నారు. అటు నాగబాబు, ఇటు అల్లు అర్జున్ సోషల్ మీడియా పోస్ట్‌ల ఆధారంగా మెగా ఫ్యామిలీలో విబేధాలు రగులుతున్నాయని కొందరూ చెప్పకనే చెబుతున్నారు. చూడాలి మరి ముందు ముందు ఏమి జరుగుతుందనేది.
Also Read :
నమ్రత కామెంట్స్.. తప్పుగా అర్ధం చేసుకుంటున్న ఫ్యాన్స్..!
పవన్ అభిమానులకు ఇక పూనకాలే.. జల్సా కొత్త ప్రింట్ గురించి ఓ డైరెక్టర్ ట్వీట్..!