Home » నమ్రత కామెంట్స్.. తప్పుగా అర్ధం చేసుకుంటున్న ఫ్యాన్స్..!

నమ్రత కామెంట్స్.. తప్పుగా అర్ధం చేసుకుంటున్న ఫ్యాన్స్..!

by Azhar
Ad
ఇప్పుడు సినిమా అభిమానులకు ఎవరికీ సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే ఎవరో తెలియకుండా ఉండదు. అయితే సర్ర్ కృష్ణ కొడుకుగా సినిమాలోకి వచ్చిన మహేష్ బాబు ఇప్పుడు తనకంటూ ప్రత్యేకమైన స్థానం అనేది ఏర్పరుచుకున్నాడు. అయితే ఇప్పుడు అందరూ మహేష్ బాబు కొడుకు గౌతమ్ ఎప్పుడు సినిమాల్లోకి వస్తాడు అని ఎదురు చూస్తున్నారు. ఆ క్రమంలోనే తాజాగా మహేష్ బాబు భార్య నమ్రత ఓ పోస్ట్ చేసింది.
తన ఇంస్టాగ్రామ్ లో గౌతం ఫోటో ను పోస్ట్ చేస్తూ దాని కింద… నీకు ఎగిసే సమయం వచ్చింది. ఇక నువ్వు ఏదైనా చేయగలవు అనే నమ్మకం నాకు కలిగింది. నీవు చాలా త్వరగా నీ మార్పును ప్రపంచానికి చూపిస్తావు అంటూ రాసుకొచ్చింది. అయితే ఈ పోస్ట్ చూసిన చాలా మంది ఇక గౌతమ్ సినిమాలోకి వచ్చే సమయం వచ్చింది. ఈ కామెంట్స్ నమ్రత ఆ ఉద్దేశ్యంలోనే చేసింది అని అనుకుంటున్నారు.
కానీ ఇక్కడే అందరూ నమ్రత కామెంట్స్ ను తప్పుగా అర్ధం చేసుకుంటున్నారు. ఈ పోస్ట్ అనేది నమ్రత గౌతమ్ యొక్క సినీ కెరియర్ గురించి చేయలేదు. అయితే గౌతమ్ ఎప్పటినుండో పారా గ్లైడింగ్ అనేది నేర్చుకుంటున్నాడు. తాజాగా అతను అందులో పర్ఫెక్ట్ అయ్యినట్లు తెలుస్తుంది. ఏ మాత్రం భయం లేకుండా గ్లైడింగ్ లోని అన్ని విన్యాసాలను గౌతమ్ చేసాడట. ఇక అది చూసి ఆశ్చర్యపోయిన నమ్రత… గౌతమ్ యొక్క పారా గ్లైడింగ్ ను ఉద్దేశించి ఈ పోస్ట్ చేసింది.

Advertisement

Visitors Are Also Reading