Home » సలార్ సినిమాపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన పోస్ట్‌….?

సలార్ సినిమాపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన పోస్ట్‌….?

by Bunty
Ad

 

రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతనికి విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. ప్రభాస్ కూడా ఎప్పుడు ప్రేక్షకులను అలరించడానికి సరికొత్త సినిమాలతో వస్తూనే ఉంటాడు. ఈ క్రమంలోనే తాజాగా ప్రభాస్ నటించిన చిత్రం ‘సలార్’. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ సక్సెస్ ను సొంతం చేసుకుంది. ఇప్పటివరకు కనివిని ఎరగని కలెక్షన్స్ తో ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంటుంది.

cm revanth reddy comments on salaar movie

ఈ సినిమా ప్రతి ఒక్కరికి విపరీతంగా నచ్చేసింది. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ సినిమాపై స్పందించారు. తనకు ఈ సినిమా విపరీతంగా నచ్చినట్టుగా అర్థమవుతుంది. అసలు విషయం ఏంటంటే….. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాగ్ పూర్ లో భారీ బహిరంగసభను నిర్వహించారు. అక్కడ సీఎం రేవంత్ రెడ్డిని ఘనంగా స్వాగతించారు.

Advertisement

అక్కడ తనను స్వాగతించిన విధానాన్ని, గౌరవాన్ని అక్కడే ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో తనకున్న అభిమానాన్ని తెలియజేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టాడు. ఆ వీడియో బ్యాక్ గ్రౌండ్ లో సలార్ సినిమాలోని సూరీడు పాటను పెట్టారు. అంతేకాదు సూరీడే గొడుగు పట్టి పాటలోని కొన్ని లిరిక్స్ ని కూడా ట్విట్టర్ లో జతచేశాడు రేవంత్ రెడ్డి. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. సలార్ సినిమాలోని పాట రేవంత్ అన్నకు కూడా నచ్చేసింది అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading