తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గురించి తెలియని వారు ఉండరు. 2014లో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఆయన అధికారంలోకి వచ్చారు. స్థానిక తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి ఆయన అధ్యక్షుడిగా, నాయకుడిగా కొనసాగుతున్నారు. సిద్ధిపేట జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు.
READ ALSO : విరూపాక్షలో ఈ అఘోరా పాత్ర హైలెట్ అవుతుందా…?
Advertisement
ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసిఆర్ గారికే దక్కింది. ఇదంతా పక్కకు పెడితే కేసీఆర్ మనవడు హిమాన్షులో మాత్రం డిఫరెంట్ షేడ్స్ కనిపిస్తున్నాయి. తాజాగా మంత్ర కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు రావు గచ్చిబౌలిలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి తన 12వ తరగతి నీ పూర్తి చేసే గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకున్నారు.
Advertisement
READ ALSO : Agent : “ఏజెంట్” సినిమా ట్రైలర్…దుమ్ములేపిన అఖిల్
కమ్యూనిటీ యాక్టివిటీ సర్వీసెస్ విభాగంలో గొప్ప ప్రతిభను కనబరిచినందుకుగాను హిమాన్షుకు సిఏఎస్ ఎక్సలెన్స్ అవార్డు అందజేశారు. గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకున్న హిమాన్షు పట్టాను తన తాత కేసీఆర్ చేతిలో పెట్టి దీవెనలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో హిమాన్షు తాత, నానమ్మ సీఎం కెసిఆర్, శోభ దంపతులు, తల్లిదండ్రులు, కేటీఆర్, శైలిమ, చెల్లెలు అలేఖ్య, హిమాన్షు అమ్మమ్మ శశిరేఖ పాల్గొన్నారు.
READ ALSO : ఇంతకీ వైఎస్ భాస్కర్ రెడ్డి ఎవరు? జగన్ భార్య భారతికి ఏమవుతారు?