వనపర్తి వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న సమయంలో మార్చి 09న నిరుద్యోగుల కోసం కీలక ప్రకటన చేయబోతున్నట్టు చెప్పారు. బుధవారం ఉదయం 10 గంటలకు నిరుద్యోగులందరూ టీవీ చూడాలని పిలుపునిచ్చారు. వనపర్తిలో నూతనంగా ఏర్పాటు చేయనున్న మెడికల్ కళాశాల నిర్మాణానికి కేసీఆర్ భూమి పూజ చేసారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు.
Advertisement
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాక్షంలు తెలిపారు. ఎక్కడ స్త్రీలు పూజించబడతారో.. గౌరవించబడతారో అక్కడ దేవతలు సంచారిస్తారు అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రం అవుతుందని ఎవ్వరూ కూడా ఊహించలేదన్నారు. మహబూబ్‌నగర్‌లో ఎక్కడ చూసినా కరువు, బీడు భూములు కనిపించేవి అని.. ఉద్యమ సమయంలో జిల్లాను చూస్తే కళ్లల్లో నీరు తిరిగేదన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే మహబూబ్‌నగర్ జిల్లా వజ్రపు తునకగా మారుతుందని తెలిపారు.
Advertisement
ధాన్యపు రాశులతో ఇప్పటికే పాలమూరు జిల్లా పాలు కారుతోందని.. హైదరాబాద్ నుంచి గద్వాల వరకు పచ్చదనం కనిపిస్తోందన్నారు. గతంలో పాలమూరు జిల్లా నుంచి లక్షల మంది వలస పోయేవారని.. ఇప్పుడు కర్నూలు, కర్ణాటక వాసులు మహబూబ్‌నగర్ జిల్లాకు వలస వస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం వనపర్తిలో ఎకరం రూ.3కోట్లు ధర పలుకుతుందన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక్కటంటే ఒక్క మెడికల్ కళాశాల లేదు. ఇవాళ ఐదు మెడికల్ కళాశాలలు మహబూబ్‌నగర్ జిల్లాలోఉన్నాయి.
Also Read : దళిత బంధు ఒక బోగస్ అంటున్నఈటల రాజేందర్