Home » ద‌ళిత బంధు ఒక బోగ‌స్‌ అంటున్న‌ఈట‌ల రాజేంద‌ర్

ద‌ళిత బంధు ఒక బోగ‌స్‌ అంటున్న‌ఈట‌ల రాజేంద‌ర్

by Anji
Ad

తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు జ‌రుగుతున్న విష‌యం తెలిసిన‌దే. అయితే నిన్న స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాస్ బీజేపీ ఎమ్మెల్యేల‌ను సస్పెండ్ చేయ‌డంతో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేత‌లు ఫైర్ అవుతూ ఉన్నారు. ఇవాళ స‌స్పెండ్ అయిన బీజేపీ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్ర‌యించారు. బీజేపీ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ మీడియాతో మాట్లాడారు. మోస‌పూరిత‌మైన బ‌డ్జెట్ ఇది అని మండిప‌డ్డారు. మంచినీటి ప‌థ‌కానికి 19వేల కోట్లు అని, మిష‌న్ కాక‌తీయ‌కు 6వేల కోట్లు అని, నీతి అయోగ్ నిధులు కేంద్రం ఇవ్వ‌లేమ‌ని చెప్పినా మ‌ళ్లీ రాష్ట్ర బ‌డ్జెట్ లో పెట్టార‌ని విమ‌ర్శించారు.

Advertisement

దాదాపు 15వేల కోట్లు భూములు అమ్మ‌కాల ద్వారా ఆదాయం వ‌స్తోంద‌ని బ‌డ్జెట్‌లో పెట్టార‌ని.. బ‌డ్జెట్ స‌మావేశాలు చాలా కీల‌క‌మైన‌వి అని, బ‌డ్జెట్ స‌మావేశాలు గ‌తంలో 40 రోజులు కొన‌సాగేవ‌ని.. శాస‌న స‌భ స‌మావేశాలు ఐదారు రోజుల‌కు ప‌రిమితం చేశార‌ని ఆరోపించారు. గ్యారంటీల కింద రాష్ట్ర ప్ర‌భుత్వం అప్పు 1,05,006 కోట్ల రూపాయ‌ల‌ని.. దళిత బంధు ఒక బోగ‌స్ అని వెల్ల‌డించారు.

Advertisement

90 శాతం ద‌ళిత బంధును పూర్తిస్థాయిలో వాడుకున్న కుటుంబం లేద‌ని, ఒక్క కుటుంబం రూ.10ల‌క్ష‌ల విలువ ఆధారిత వాడుకోలేదు. కేవ‌లం 2-3 ల‌క్ష‌ల‌తో స‌రిపెడుతున్నార‌ని పేర్కొన్నారు. హుజూరాబాద్లో అదే జ‌రిగింద‌ని.. రాష్ట్రంలో లిక్క‌ర్ ఆదాయం 37,220 కోట్ల‌కు చేర‌కుంద‌ని.. తాగ‌డానికి బానిస‌ల‌ను చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్ర యువ‌శ‌క్తి గంజాయి, లిక్క‌ర్‌, డ్ర‌గ్స్‌కు బానిస‌వుతున్నార‌ని.. రెసిడెన్షియ‌ల్ స్కూల్ బిల్డింగ్స్ కోసం బ‌డ్జెట్‌లో ఒక్క పైసా కూడా పెట్ట‌లేద‌ని మండిప‌డ్డారు ఈట‌ల‌. మ‌ద్యం ద్వారా ఆదాయం పెంచుకోవ‌డం కాదు.. ఐటీ కంపెనీలను పెంచుకుని ఆదాయం పెంచుకోవాల‌ని హిత‌వుప‌లికారు.

Also Read :  Viral Video : సింగిల్ హ్యాండ్‌తో సిక్స్ కొట్టిన ధోని..!

Visitors Are Also Reading