Home » పొటాటో అంటే ఉల్లిగడ్డలు…సోషల్ మీడియాలో సీఎం జగన్ వ్యాఖ్యలు వైరల్

పొటాటో అంటే ఉల్లిగడ్డలు…సోషల్ మీడియాలో సీఎం జగన్ వ్యాఖ్యలు వైరల్

by Bunty
Ad

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా వింతగా ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో కంటే ఏపీ రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతాయి. ముఖ్యంగా ఏపీలో ఉన్న కీలక నేతలు మాట్లాడే మాటలు సోషల్ మీడియాలో ఎప్పుడు వైర్లు అవుతూనే ఉంటాయి. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి… స్పీచ్ కూడా చాలా వింతగా ఉంటుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఇలా మాట్లాడుతారో ఆయనకే తెలియదు.

CM Jagan’s comments on social media are viral

నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తారు సీఎం జగన్. అయితే తాజాగా మరోసారి ఉల్లిగడ్డలపై కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురయ్యారు సీఎం జగన్. తాజాగా తిరుపతి జిల్లా వరద బాధిత ప్రాంతాలలో సీఎం జగన్ పర్యటించారు. ఈ సందర్భంగా వరద బాధితులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టినట్లు సీఎం జగన్ వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… బంగాళదుంపలను ఉల్లిగడ్డలు అన్నారు.

Advertisement

jagan slams chandrababu over skill development scam

jagan slams chandrababu over skill development scam

పొటాటోస్ అంటే ఉల్లిగడ్డలు అంటూ టంగ్ స్లిప్ అయ్యారు జగన్. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు కూడా స్పందించారు. సీఎం జగన్కు ఉల్లిగడ్డకు మరియు ఆలుగడ్డకు తెలియట్లేదని చురకలాంటించారు. ఇలాంటి ముఖ్యమంత్రిలకు రైతుల కష్టాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు. ప్రకృతి విపత్తుకు మానవ తప్పిదం తోడవ్వడం వల్ల తీవ్ర నష్టం జరిగిందన్నారు.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading