సినీపరిశ్రమలో చాలా మంది సెలబ్రెటీలు ప్రేమవివాహాలు చేసుకున్నారు కానీ వాళ్లలో విడిపోకుండా కలిసి ఉన్నవాళ్లను వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. ఇక విడిపోయేటప్పుడు సాధారణ భార్యా భర్తల్లాగానే సెలబ్రెటీలు కూడా భరణం ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇక వారి రేంజ్ సంపాదన వేరు కాబట్టి భరణం కూడా కోట్లలోనే ఉంటుంది. ఇక ఇప్పటి వరకూ అలా పెళ్లి తరవాత విడిపోయి భరణం ఇచ్చిపుచ్చుకున్న సెలబ్రెటీలు ఎవరో ఇప్పుడు చూద్దాం….సంజయ్ కపూర్ కరిష్మా కపూర్ 1990 దశకంలో బాలీవుడ్ ను షేక్ చేసిన హీరోయిన్ కరిష్మా కపూర్. హీరోయిన్ గా పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో కరిష్మా సంజయ్ కపూర్ ను పెళ్లాడింది.
Advertisement
Ad
ఆ తరవాత ఈ జంట అమెరికాలో స్థిరపడింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. అయితే ఆ తరవాత ఈ జంట విడిపోవాలని నిశ్చియించుకుంది. దాంతో విడాకుల తరవాత 11కోట్ల భరణాన్ని సంజయ్ కపూర్ ముట్ట జెప్పాడు. అంతే కాకుండా ఖరీదైన కార్లు మరియు ఓ భవనం సైతం కరిష్మా భరణంగా పుచ్చుకుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా తన భార్య రమాలతకు విడాకులు ఇచ్చే సమయంలో భారీ మొత్తంలో భరణం ఇచ్చాడు. నయనతారతో ప్రేమాయణం తరవాత ప్రభుదేవా తన భార్యకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఆ సమయంలో ప్రభుదేవ 25 కోట్ల భరణం తో పాటు రెండు ఖరీదైన కార్లను భార్యకు ఇచ్చాడు.
Advertisement
బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ తన బాల్యస్నేహితురాలు సుశాంత్ ఖాన్ ను వివాహం చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు పిల్లలు పుట్టిన తరవాత వీరిద్దరూ విడాకులు తీసుకునేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఆ సమయంలో హృతిక్ తన భార్యకు రూ.5 కోట్ల భరణంతో పాటు తన ఆస్తిలో పిల్లలకు వాటా ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నాడు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన మొదటి భార్య నందినికి రూ.1 కోటి భరణం గా ఇచ్చాడు.
ఆ తరవాత రేణూ దేశాయ్ ని పెళ్లాడిన పవన్ కల్యాణ్ ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో రేణూదేశాయ్ కి కూడా విడాకులు ఇచ్చాడు. విడాకుల సమయంలో పవన్ తన ఇద్దరు పిల్లలకు కోట్ల రూపాయల ఆస్తులను ఇచ్చినట్టు జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఆ వార్తలను రేణూదేశాయ్ కండించింది. ఇదిలా ఉంటే రీసెంట్ సమంత నాగ చైతన్యలు విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సమంత కూడా భరణం తీసుకునేందుకు నిరాకరించినట్టు ఫిల్మ్ నగర్ లో ప్రచారం జరుగుతోంది.
Also Read:సుధీర్ అసలు పేరు తెలుసా…జబర్దస్త్ కు ముందు ఏం చేశాడో తెలుసా..?