Home » కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ హీరోగా సినిమా.. ఫస్ట్ లుక్ అదిరిందిగా!

కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ హీరోగా సినిమా.. ఫస్ట్ లుక్ అదిరిందిగా!

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గురించి పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. తెలుగే కాకుండా ఎన్నో కన్నడ, హిందీ, తమిళ సినిమాలు కలుపుకుని 150 కి పైగా సినిమాలకు కొరియోగ్రఫీ చేశారాయన. ఇక బుల్లితెరపై కూడా కొన్ని డాన్స్ ప్రోగ్రామ్స్ కు జడ్జిగా వ్యవహరించారు.

Advertisement

తాజాగా జానీ మాస్టర్ సినిమా హీరోగా రాబోతున్నారు. విజయ్ చౌదరి దర్శకత్వంలో జానీ మాస్టర్ హీరోగా ‘రన్నర్‌’ అనే యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమాను రూపొందిస్తున్నారు. నేడు జానీ మాస్టర్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర బృందం సినిమా టైటిల్ ను వెల్లడించింది. జానీ మాస్టర్ ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేసారు. ఈ నెల 20 నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది.

Advertisement

ఈ సినిమాలో జానీ మాస్టర్‌ క్యారెక్టరైజేషన్ చాలా ఇంటరెస్టింగ్ గా ఉంటుందని నిర్మాతలైన విజయ భాస్కర్, జి. ఫణీంద్ర, ఎం శ్రీహరి లు పేర్కొన్నారు. తండ్రీకొడుకుల మధ్య సాగే ఎమోషనల్ సీన్స్ ఈ సినిమాలో హైలైట్ గా నిలవనున్నాయి. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం, నేపధ్య సంగీతం అందించనున్నారు. ఈ సినిమా పోస్టర్ లో జానీ మాస్టర్ కాస్ట్యూమ్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి.

మరిన్ని ముఖ్య వార్తలు:

ఉపాసన డెలివరీ కోసం అన్ని కోట్లు ఖర్చు పెట్టారా?

రామ్‌చరణ్ కూతురికి అంబానీ అత్యంత ఖరీదైన గిఫ్ట్!

ఒక్క యాడ్ కోసం.. రాజమౌళి ఎంత పారితోషకం తీసుకున్నారు అంటే..?

Visitors Are Also Reading