Home » చిరంజీవికి ఇప్పటికి తీరని కోరిక..ఏంటంటే..?

చిరంజీవికి ఇప్పటికి తీరని కోరిక..ఏంటంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండానే స్టార్ హీరోగా, మెగాస్టార్ గా ఎదిగారు చిరంజీవి. ఆరు పదుల వయసులో కూడా ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ అప్పటి జనరేషన్, ఇప్పటి జనరేషన్ కు ఫేవరెట్ హీరోగానే కొనసాగుతున్నారు. అలాంటి చిరంజీవి సినిమా వస్తుంది అంటే అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. చిరంజీవి సౌత్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపాడు. హిందీలో కూడా నటించారు. అయితే చిరంజీవికి మాత్రం హాలీవుడ్ రేంజ్ లో ఒక సినిమాలో నటించాలనే కోరిక బలంగా ఉండేదట. అప్పట్లో అలాంటి సినిమా కోసం కూడా ప్రయత్నం చేశారు.

Advertisement

Also Read;మెగా ఫ్యామిలీపై విమర్శలు… రోజాను ఓ ఆట ఆడుకున్న బ్రహ్మాజీ !

Advertisement

సినిమా పేరు అబ్ బాగ్దాద్ గజదొంగ. ఈ సినిమా కోసం అమెరికాలో స్థిరపడినటువంటి ముగ్గురు భారతీయులతో కలిసి 40 కోట్లకు పైగా బడ్జెట్ చిత్రం తీయాలని అనుకున్నారు. ఈ సినిమా కోసం హాలీవుడ్ మూవీ మేకర్స్ ని రంగంలోకి దింపాలని భావించారు. ఇక సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ ఫైనల్ చేశారు. ఇలా అన్ని జరిగిన తర్వాత సినిమా మాత్రం పట్టాలేక్కలేదు. దీనికి ప్రధాన కారణం ఆ సినిమా స్క్రిప్ట్ లో ఒక మతం వారిని కించపరిచే విధంగా ఉన్నదంటూ ఒక వార్త బయటకు లీక్ అయింది.

దీంతో ఆ మతానికి చెందినవారు ఆ సినిమాను ఆపేయాలని డిమాండ్ చేశారు. ఈ విధంగా మెగాస్టార్ కలలు కన్నా హాలీవుడ్ సినిమా ఎంట్రీకి బ్రేక్ పడింది. అయితే చిరంజీవి హాలీవుడ్ రేంజ్ కి వెళ్లకపోయినా కానీ ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ హాలీవుడ్ రేంజ్ ను అందుకున్నాడు. అయితే చిరంజీవి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. మరి ఈ క్రమంలోనైనా ఆయన కోరిక తీరుతుందా లేదా అనేది ముందు ముందు తెలుస్తుంది.

Also Read:చిరంజీవితో ‘విశ్వాసం’ రీమేక్.. క్లారిటీ ఇచ్చిన వినాయక్..!

Visitors Are Also Reading