Home » చిరంజీవితో ‘విశ్వాసం’ రీమేక్.. క్లారిటీ ఇచ్చిన వినాయక్..!

చిరంజీవితో ‘విశ్వాసం’ రీమేక్.. క్లారిటీ ఇచ్చిన వినాయక్..!

by Bunty
Ad

మెగాస్టార్‌ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇటీవల రిలీజ్‌ అయిన వాల్తేరు వీరయ్య సినిమాతో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ ను అందుకున్నాడు చిరంజీవి. బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 130 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ విజయంతో నూతన ఉత్సాహంలో ఉన్న చిరంజీవి తాజాగా ఓ తమిళ రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.

Advertisement

అజిత్ విశ్వాసం రీమేక్ లో చిరంజీవి నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రీమేక్ కు వి.వి.వినాయక దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. గతంలో చిరంజీవి దర్శకుడు వివి వినాయక్ కాంబినేషన్ లో ఠాగూర్, ఖైదీ నెంబర్ 150 సినిమాలోచ్చాయి. దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత విశ్వాసం వీరిద్దరూ కలిసి మూడోసారి పని చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మెగాస్టార్ వరుసగా రీమేక్ లు చేయడంపై ఫ్యాన్స్ మాత్రం అసహనంగా ఉన్నారు.

Advertisement

డైరెక్ట్ ఫిల్మ్ అయిన వాల్తేరు వీరయ్య భారీ హిట్ కొట్టడంతో అలాంటి సినిమాలే చేయాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అటు తన ఇమేజ్ కు తగ్గట్టుగా మార్పులు చేసి ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని చిరు భావిస్తున్నట్టు వార్తలు మొదలయ్యాయి. ఈ టాపిక్ కూడా పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతుంది. అయితే దర్శకుడు వినాయక్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. అది వట్టి గాసిప్ మాత్రమే అని తేల్చి చెప్పేసారు. దీంతో మెగా ఫ్యాన్స్ కూల్ అవుతున్నారు.

READ ALSO : Mission Majnu Review : స్పై థ్రిల్లర్ ‘మిషన్ మజ్ను’ రివ్యూ

Visitors Are Also Reading