Home » మెగాఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలో పుస్తక రూపంలో చిరంజీవి జీవితం..!

మెగాఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలో పుస్తక రూపంలో చిరంజీవి జీవితం..!

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవి గా పరిచయమైన కొణిదెల శివశంకర వరప్రసాద్ బయోగ్రఫీ నీ ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ కు అప్పగించారు చిరంజీవి. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి నే ప్రకటించారు. వైజాగ్ లోని లోకనాయక్ ఫౌండేషన్ నిర్వహించిన ఎన్టీఆర్ 28వ వర్ధంతి, ఏఎన్నార్ శతజయంతి కార్యక్రమం లో పాల్గొన్న చిరంజీవి యండమూరి సమక్షంలోనే ఈ ప్రకటన చేశారు. లోక్ నాయక్ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో యండమూరి తో పాటు పలు రంగాల ప్రముఖులకు అవార్డులు అందించారు ఫౌండేషన్ ప్రతినిధి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. ముఖ్య అతిథిగా  చిరంజీవి హాజరయ్యారు.

Advertisement

Advertisement

తెలుగు జాతికి నిలువెత్తు నిదర్శనం ఎన్టీఆర్-ఏఎన్నార్ అని చెప్పారు. వీరిద్దరి  గొప్పతనం గురించి ప్రశంసా పూర్వక ప్రసంగం చేశారు చిరంజీవి. తరువాత  తన బయోగ్రఫీ గురుంచి  మాట్లాడారు. తన బయోగ్రఫీ రాసుకునే సమయం తనకి లేదని, ఈ నేపథ్యంలో నా బయోగ్రఫీ రాసే సామర్ధ్యం ఒక్క యండమూరి కే ఉందని.. అందుకే ఆ బాధ్యత యండమూరి కి అప్పగిస్తున్నానన్నారు చిరు. సమకాలీన రచయితలలో యండమూరి కి ఎవరూ సాటి లేరు, ఆయన రాసిన అభిలాష సినిమాతోనే పరిశ్రమలో నా స్థానం పదిలం అని అప్పుడే ఫిక్స్ అయ్యానంటూ యండమూరి పై ప్రశంసల వర్షం కురిపించారు చిరు. ఇప్పుడు నా బయోగ్రఫీ రాసే సమయం నాకు లేదు కాబట్టి ఈ బాధ్యతని యండమూరికి అప్పగిస్తున్నా అంటూ అభిమానుల హర్షద్వానాల మధ్య ప్రకటించారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading