మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యగ్రౌండ్ లేకుండా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదిగారు. కెరీర్ ప్రారంభం లో చిన్న చిన్న పాత్రలు చేసి హీరోగా అవకాశాలు అందుకున్నారు. ఆ తరవాత తన డ్యాన్స్ నటన తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. కేవలం ఒకే తరహా సినిమాలకు పీక్స్ అవ్వకుండా అన్ని రకాల సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించాడు.
ఇవి కూడా చదవండి: శివాజీ సినిమాలోని అక్కమ్మ జక్కమ్మలు మీకు గుర్తున్నారా.. ఇప్పుడు ఎంత అందంగా ఉన్నారంటే..?
Advertisement
ఎంతటి స్టార్ హీరో అయినా కెరీర్ లో ఫ్లాప్ లు తప్పవు. మెగాస్టార్ లో కెరీర్ లో కూడా ఫ్లాప్ లు ఉన్నాయి. అయితే భారీ అంచనాల నడుమ వచ్చి బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకున్న అంజి సినిమా మాత్రం మెగాస్టార్ ను ఎక్కువ నిరాశ పరించింది. ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు.
Advertisement
మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. 1997 లోనే ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. అప్పటి నుండి మీడియాలో అంజి సినిమా వార్తలు తరచూ కనిపించేవి. అయితే ఈ సినిమా పూర్తి కావడానికి ఏడేళ్లు పట్టింది. అప్పట్లోనే 25 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 2004 లో విడుదల అయ్యింది. సినిమా కోసం హాలీవుడ్ రేంజ్ లో గ్రాఫిక్ ను ఉపయోగించారు. ఇలా సినిమాలో ఎన్నో హైలైట్స్ ఉన్నాయి.
ఇవి కూడా చదవండి: ఆ హీరోయిన్ ను నాగార్జున సీక్రెట్ గా ముంబైలో కలిసేవారట.. ఓ రోజు ఏం జరిగిందంటే..?
ఈ సినిమా కు పరుచూరి బ్రదర్స్ మాటలు రాశారు. అయితే భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా మాత్రం ఫ్లాప్ అయ్యింది. దాంతో నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారట. ఆ తరవాత అరుంధతి సినిమా తో కోలుకున్నారట. అయితే ఈ సినిమా లో మాసిన షర్ట్ తో కనిపించడానికి చిరంజీవి ఓకే షర్ట్ ను ఏకంగా రెండేళ్ల పాటు వేసుకున్నారు. అది కూడా షర్ట్ ను ఉతకకుండా వేసుకున్నారు.
Also read : బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ ని రమ్యకృష్ణ ఏమన్నదో తెలుసా..?