మెగాస్టార్ చిరంజీవి గురించి తెలియని వారు ఉండరు. చిత్ర పరిశ్రమలో ఎంతో కష్టపడి పైకి వచ్చారు మెగాస్టార్ చిరంజీవి. మొదట్లో చిన్న పాత్రలు చేసుకుంటూ… ఇప్పుడు అగ్ర హీరోగా కొనసాగుతున్నారు చిరు. అంతేకాదు తన కుటుంబంలో ఉన్న వాళ్లను కూడా హీరోలుగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయించాడు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు ఇండస్ట్రీలో మెగాస్టార్ కుటుంబానికి ఒక ఫేత్ ఉందంటే దానికి కారణం చిరంజీవి అని చెప్పక తప్పదు.
Advertisement
ఇక చిరంజీవిలాగే రాజమౌళి కూడా ఇంత సక్సెస్ అయ్యాడు. బాహుబలి సినిమాతో రాజమౌళి ఎక్కడికో వెళ్లిపోయాడు. ఇక ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ స్థాయికి వెళ్ళింది రాజమౌళి క్రెడిట్. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో రాజమౌళి బ్రాండ్ మరింత పెరిగింది. అయితే రాజమౌళి తల్లికి.. చిరంజీవికి ఉన్న రిలేషన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ దర్శకుడుగా పెద్దగా సక్సెస్ కాకపోయినా రైటర్ గా మాత్రం మంచి పట్టు ఉంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Advertisement
తమ కుటుంబంలో కులమతాలతో సంబంధం లేదని… తన భార్య ఏ కులానికి చెందినదో ఇప్పటికీ తనకు తెలియదని వెల్లడించారు. అయితే చిరంజీవి హీరోగా నటించిన ఖైదీ సినిమా విడుదలైన సమయంలో తమ మధ్యన ఆసక్తికర సంభాషణ జరిగిందని వివరించారు. ఖైదీ సినిమా చూసి మా చిరంజీవి సినిమా అని… తన భార్య చెప్పినట్లు ఆయన వెల్లడించారు. మా చిరంజీవి అంటే ఏంటని అడగ్గా… చిరంజీవి కాపులేగా అంటూ సమాధానం ఇచ్చిందట ఆమె. దాంతో తన భార్య కాపు కులానికి చెందిన వారని అర్థం అయిందని విజయేంద్రప్రసాద్ చెప్పారు.
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:
భర్తను భార్య ఇలా చూసుకుంటే… మరో స్త్రీ వైపు కన్నెత్తి కూడా చూడడు !
దుబాయిలో రూ.100 కోట్లతో షారుఖ్ విల్లా… స్వర్గం కూడా పనికిరాదు !
Mahesh Babu : “గుంటూరు కారం”తో వచ్చేసిన ప్రిన్స్ మహేష్