Home » Mahesh Babu : “గుంటూరు కారం”తో వచ్చేసిన ప్రిన్స్ మహేష్

Mahesh Babu : “గుంటూరు కారం”తో వచ్చేసిన ప్రిన్స్ మహేష్

by Bunty
Ad

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఏజ్ బార్ అయినప్పటికీ.. టాలీవుడ్ స్టార్ హీరోల లిస్టులో.. టాప్ ఫై లో ఉంటాడు మహేష్ బాబు. ఇక ఇటీవల సరిలేరు నీకెవరు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న మహేష్ బాబు ఇప్పుడు త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సూపర్ సార్ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబోలో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి.

Advertisement

ఇది మూడో సినిమా కావడం విశేషం. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే మొదటి హీరోయిన్గా నటిస్తోంది. అలాగే పెళ్లి సందడి ఫేమ్ శ్రీ లీల కూడా ఈ సినిమాలో రెండవ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ షూటింగ్ దాదాపు పూర్తయింది. అయితే ఇప్పటివరకు ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేయకుండా… SSMB 28 పేరుతో ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం.

Advertisement

ఈ సినిమాకు “గుంటూరు కారం” అనే టైటిల్ ను అనౌన్స్ చేసింది చిత్ర బృందం. ఈ మేరకు ఓ వీడియోను కూడా విడుదల చేశారు. ఫ్యాన్స్ కోసం ముందు థియేటర్లలో రిలీజ్ చేయగా… తాజాగా యూట్యూబ్లోనూ ఈ వీడియోను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఇక ఈ వీడియోలో మహేష్ బాబు మాస్ లుక్ లో అలరించారు. అలాగే ఈ వీడియోలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. కాగా ఈ సినిమా వచ్చేయడాది సంక్రాంతి కానుకగా తెలుగు ప్రేక్షకులు ముందుకు రానుంది.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

పవన్ కళ్యాణ్ 3వ భార్య ఆస్తులు విలువ తెలుసా?

Vijayashanthi : చిరంజీవితో 20 ఏళ్లుగా విజయశాంతి ఎందుకు మాట్లాడకుండా ఉన్నారో తెలుసా ?

Shubman Gill : సచిన్‌ కూతురు కోసం..గిల్‌ త్యాగం !

Visitors Are Also Reading