Home » దుబాయిలో రూ.100 కోట్లతో షారుఖ్ విల్లా… స్వర్గం కూడా పనికిరాదు !

దుబాయిలో రూ.100 కోట్లతో షారుఖ్ విల్లా… స్వర్గం కూడా పనికిరాదు !

by Bunty
Ad

బాలీవుడ్ చిత్ర పరిశ్రమ లో చాలామంది స్టార్ హీరోలు ఉన్నారు. అందులో కొంతమంది ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వస్తే… మరికొందరు సొంతగా వచ్చి ఇండస్ట్రీని ఏలుతున్నారు. అలా వచ్చిన వారిలో షారుఖ్ ఖాన్ ఒకడు. బాలీవుడ్ హీరోలలో ఇప్పటికీ అగ్ర హీరోగా షారుక్ ఖాన్ కొనసాగుతున్నాడు. ఆయన ఏ సినిమా చేసిన మంచి విజయం సాధిస్తుంది. ఇటీవల షారుక్ నటించిన పఠాన్ సినిమా ఏ మేరకు విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సింపుల్గా చెప్పాలంటే కరోనా తర్వాత బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు ఊపిరి పోసింది పటాన్ సినిమానే.

Advertisement

ఈ సినిమా ఏకంగా 300 కోట్లు కలెక్షన్ చేసింది. ఆర్మీ , దేశ రక్షణ బ్యాగ్రౌండ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా.. ఇప్పటికీ ఓటీటీలో మంచి వ్యూస్ ను సంపాదిస్తోంది. అయితే బాలీవుడ్ హీరోలలో షారుక్ ఖాన్ భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. ఈ తరుణంలోనే ముంబై, ఢిల్లీ లండన్ లో విలాసవంతమైన బంగ్లాలను కొనుగోలు చేశాడు ఈ టాప్ హీరో. లండన్ లో ఏకంగా 150 కోట్ల తో విల్లాను కొనుగోలు చేసినట్లు సమాచారం. షారుఖ్ ఖాన్ ప్రపంచవ్యాప్తంగా విలాసవంతమైన ఆస్తులలో కొన్ని గొప్ప పెట్టుబడులు పెట్టారు.

Advertisement

దుబాయ్‌లోని ప్రతిష్టాత్మకమైన పామ్ జుమేరాలో షారుక్ ఖాన్ కు విలాసవంతమైన విల్లా ఉంది. ఇప్పటివరకు ఇతను కొన్న వాటిలో ఈ విల్లా చాలా ప్రత్యేకమైనది. తాజా నివేదికల ప్రకారం, 14,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న విల్లా విలువ ఇప్పుడు రూ. 100 కోట్లు గా ఉందట. ఈ విలాసవంతమైన విల్లాలో ఆరు విశాలమైన బెడ్‌రూమ్‌లు, రెండు రిమోట్-నియంత్రిత గ్యారేజీలు, ఒక ప్రైవేట్ పూల్ ఉంది. అంతేకాదు బాల్కనీలో బీచ్ కనిపించేలా చక్కటి నిర్మాణం కూడా ఉంది. ఈ విల్లాలోకి వెళితే స్వర్గంలోకి వెళ్లినట్లే ఉంటుందట. ఏడాదిలో కచ్చితంగా మూడుసార్లు అక్కడికి వెళ్తారని సమాచారం.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

Faima : ఫైమా నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా?

Shubman Gill : సచిన్‌ కూతురు కోసం..గిల్‌ త్యాగం !

భర్తను భార్య ఇలా చూసుకుంటే… మరో స్త్రీ వైపు కన్నెత్తి కూడా చూడడు !

Visitors Are Also Reading