Home » చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు..? కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన?

చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు..? కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన?

by Srilakshmi Bharathi
Ad

మెగా స్టార్ చిరంజీవి పేరుని భారతీయ సినీ పరిశ్రమలో తెలియని వారు ఉండరు. మెగాస్టార్ తన నటనా జీవితంలో 156కి పైగా చిత్రాలలో విజయవంతంగా నటించారు. సినిమా ఇండస్ట్రీలో ఆయన గురించి చెప్పాలంటే ఓ అధ్యాయమే పడుతుంది. ఆయన నటించిన సినిమాలు, పొందిన అవార్డులు, బ్లడ్ బ్యాంకు తో సహా చేసిన దాతృత్వాలు, ఇలా చెప్పుకుంటూ పోతే విషయాలకు లెక్క లేదు. తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్తా వైరల్ అవుతోంది. అదేంటంటే.. మెగాస్టార్ చిరంజీవి త్వరలో భారత ప్రధాని నరేంద్ర మోడీ నుండి ప్రత్యేక అవార్డును అందుకోనున్నారు.

Advertisement

సోషల్ మీడియా నివేదికల ప్రకారం, ఇండస్ట్రీ ఛాలెంజింగ్ పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో చిరంజీవి నిబద్ధతతో సామాజిక సేవ అందించారు. కోవిడ్‌తో బాధపడుతున్న వ్యక్తులకు క్లిష్టమైన వైద్య సదుపాయాలను అందించడానికి చిరు 2019లో అంబులెన్స్ సేవను ప్రారంభించాడు. మహమ్మారి సమయంలో ఆయన చేసిన సేవ విస్తృతమైంది. చిరంజీవికి భారతదేశపు రెండవ అత్యున్నత గౌరవ పురస్కారం అందజేయబడుతుందని సూచించబడింది మరియు దీనిని భారత ప్రభుత్వం జనవరి 26, 2024న అధికారికంగా ప్రకటించాలని భావిస్తున్నారు.

Advertisement

సోషల్ మీడియాలో చిరు అభిమానుల సందడి ఎక్కువైంది. ఈ విషయమై అధికారిక ప్రకటన చేయగానే మెగా అభిమానులు వేడుక చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. చిరంజీవి గతంలో 2006లో పద్మభూషణ్‌ను అందుకున్నారు. చివరగా ఈయన వాల్తేరు వీరయ్య సినిమాతో అలరించారు. త్వరలోనే మరో కొత్త సినిమాతో ఆయన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మెగాస్టార్ నటిస్తున్న 156వ చిత్రానికి ‘విశ్వంభర’ అనే పేరు పెట్టారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading