Home » జ‌బ‌ర్ద‌స్త్ కు సుడిగాలి సుధీర్ టీమ్ గుడ్ బై…స్టేజ్ పైనే ప్ర‌క‌ట‌న‌..!

జ‌బ‌ర్ద‌స్త్ కు సుడిగాలి సుధీర్ టీమ్ గుడ్ బై…స్టేజ్ పైనే ప్ర‌క‌ట‌న‌..!

by AJAY
Ad

తెలుగులో వ‌చ్చిన కామెడీ షోల‌లో జ‌బ‌ర్ద‌స్థ్ ప్ర‌త్యేక‌మైన షో అని ప్ర‌త్యేంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఇప్ప‌టి వ‌ర‌కూ తెలుగులో ఎన్నో కామెడీ షోలు వ‌చ్చినా జ‌బ‌ర్ద‌స్థ్ కు వ‌చ్చినంత పాపులారిటీ ఏ షోకు కూడా రాలేదు. అంతే కాదు షో ప్రారంభించి కొన్నేళ్లు గ‌డుస్తున్నా ఇప్ప‌టికీ షో క్రేజ్ ఉంది. అంతే కాకుండా టీఆర్పీ రేటింగ్ కూడా ఉంది. ఇక ఈ షోలో వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రి కెరీర్ కూడా సెట్ అయ్యింద‌నే చెప్పాలి. జ‌బ‌ర్ద‌స్థ్ కు యాంక‌ర్ గా వ‌చ్చిన అన‌సూయ ఆ త‌ర‌వాత ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఓ వైపు టీవీ షోలు మ‌రోవైపు సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉంది. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా సినిమా పుష్ప‌లో న‌టించింది. ఇక ఎంత బిజీగా ఉన్నా అన‌సూయ జ‌బ‌ర్ద‌స్థ్ ను వీడ‌లేదు.

Advertisement

sudigali sudheer team

sudigali sudheer team

యాంక‌ర్ ర‌ష్మి కూడా జ‌బ‌ర్ధ‌స్థ్ తోనే పాపుల‌ర్ అయ్యింది. ఈ షోతో హాట్ యాంకర్ గా ర‌ష్మి త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చ‌కుంది. ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు టీవీ షోల‌తో బిజీగా ఉంది. మ‌రోవైపు ఈ షోలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది క‌మెడియ‌న్ ల గురించి. ధ‌న్ రాజ్, వేణు, చ‌మ్మ‌క్ చంద్ర‌, సుడిగాలి సుధీర్, రాఘ‌వ, గెట‌ప్ శ్రీను, హైప‌ర్ ఆది, ఆటో రామ్ ప్ర‌సాద్ లాంటి వారు ఈ షో ద్వారానే ఎక్కువ పేరు సంపాదించుకున్నారు. వీరంద‌రూ కూడా ఈ షో త‌ర‌వాత సినిమాల్లో న‌టిస్తూ క‌మిడియ‌న్ లుగా వ‌రుస అవ‌కాశాల‌ను ద‌క్కించుకుంటున్నారు.

Advertisement

అయితే వీరిలో సుడిగాలి సుధీర్ మ‌రియు ఆటో రాంప్ర‌సాద్, గెట‌ప్ శ్రీను ల స్కిట్ ల‌ను జ‌నాలు భాగా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా సుడిగాలి సుధీర్ స్కిట్ లు యూత్ కు ఎక్కువ‌గా క‌నెక్ట్ అవుతుంటాయి. అయితే సుధీర్ అండ్ టీమ్ జ‌బ‌ర్ద‌స్త్ కూడా దూరం అవుతున్నారంటూ అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చిన సంగతి తెలిసిందే. కానీ ఆ త‌ర‌వాత కూడావీరు షోలో కొన‌సాగారు. కానీ లేటెస్ట్ ప్రోమోలో ఆ వార్త‌లు నిజ‌మేన‌ని తాము జ‌బ‌ర్దస్త్ ను వీడుతున్నామ‌ని ముగ్గురూ చెబుతున్నారు. కాగా ఈ వీడియోను కేవ‌లం జ‌నాల చెవిలో పువ్వుపెట్ట‌డానికి చేశార‌ని….అది కూడా స్కిట్ లో భాగ‌మ‌ని నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.

Visitors Are Also Reading