Telugu News » CHIRANJEEVI : చిరిగిన చొక్కాతోనే చిరు ఎందుకు పెళ్లి పీటలు ఎక్కారంటే ? వెనుక స్టోరీ అంత ఉందా!

CHIRANJEEVI : చిరిగిన చొక్కాతోనే చిరు ఎందుకు పెళ్లి పీటలు ఎక్కారంటే ? వెనుక స్టోరీ అంత ఉందా!

by AJAY MADDIBOINA

టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ ప‌డిన‌క‌ష్టం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా మెగాస్టార్ ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి స్టార్ హీరో రేంజ్ కు ఎదిగారు. కేవ‌లం సినిమాల‌పై ఉన్న ప్రేమ అభిమానంతోనే మెగాస్టార్ ఈ స్థాయికి చేరుకున్నారు. రాజ‌కీయాల్లోనూ రాణించి కేంద్ర‌మంత్రి స్థాయికి చేరుకున్నారు కానీ ఆ త‌ర‌వాత రాజ‌కీయాలు త‌న‌కు సెట్ కావ‌ని పూర్తిగా రాజ‌కీయాల నుండి పక్క‌కు త‌ప్పుకున్నారు.

Ads

ALSO READ :  Chiru సినిమా కోసం సింహానికి 67 ల‌క్ష‌ల పారితోషికం!?

ప్ర‌స్తుతం ఏ రాజ‌కీయ‌పార్టీకి మ‌ద్ద‌తు తెల‌ప‌కుండా మ‌ళ్లీ సినిమాలు చేస్తున్నారు. ఖైదీ నంబ‌ర్ 150 సినిమాతో రీఎంట్రీ ఇచ్చి హిట్ అందుకున్నారు. రీసెంట్ గా ఆచార్య సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్నారు. ఈ సినిమా విడుద‌ల‌కు సిద్దంగా ఉంది. ఇదిలా ఉండ‌గా చిరంజీవి ప్ర‌ముఖ న‌టుడు క‌మెడియ‌న్ అల్లు రామ‌లింగ‌య్య కూతురు సురేఖ‌ను వివాహం చేసుకున్నారు.

1980 సంవ‌త్స‌రంలో వీరి వివాహం ఘనంగా జ‌రిగింది. ఇదిలా ఉండ‌గా చిరంజీవి త‌న పెళ్లి గురించి కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను ఓ ఇంట‌ర్వ్యూలో బ‌య‌ట‌పెట్టారు. పెళ్లి స‌మ‌యంలో తాను తాత‌య్య ప్రేమ‌లీల‌లు అనే సినిమాలో న‌టిస్తున్న‌ట్టు తెలిపారు.

ఇక ఈ సినిమాలో నూత‌న్ ప్ర‌సాద్ కూడా న‌టిచంగా ఆయ‌న అప్పుడు బిజీ న‌టుడు అని దాంతో ఆయ‌న డేట్స్ వ‌ల్ల త‌న పెళ్లిని కూడా పోస్ట్ పోన్ చేసుకున్నాన‌ని మెగాస్టార్ తెలిపారు. అంతే కాకుండా త‌న పెళ్లి స‌మ‌యానికి చొక్కా చిరిగింద‌ని చెప్పారు. ఆ విష‌యాన్ని త‌న‌కు సురేఖ తెలిపిందని అన్నారు. చొక్కా మార్చుకోమ‌ని చెప్పింద‌ని కానీ తాను చిరిగిన చొక్కాతో తాలి క‌ట్ట‌లేనా అంటూ స‌ర‌దాగా అలానే తాలి క‌ట్టేశాన‌ని చెప్పారు.


You may also like