తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరావు అంటే కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన తన నటనా శైలితో ఇండస్ట్రీలో పేరుతో పాటుగా గౌరవాన్ని కూడా సంపాదించుకున్నారు. ఆయన నట వారసుడిగా హీరో నాగార్జున చిన్ననాటినుండే బాలనటుడిగా చేస్తూ “విక్రమ్” అనే సినిమాతో మొదటిసారిగా హీరో గా ఎంట్రీ ఇచ్చారు. ఫస్ట్ సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న నాగార్జున తర్వాత మజ్ను, సంకీర్తన అని మూవీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అనేక విజయాలను సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంలో “సంకీర్తన” మూవీ డైరెక్టర్ గీతాకృష్ణ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ..
Advertisement
ఆ సినిమా గురించి, అందులో నాగార్జున హీరోగా తీసుకోవడం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. ఇది గీతాకృష్ణకు మొదటి సినిమా. ఈ మూవీలో హీరోగా నాగార్జునని తీసుకోవడం కొరకు ముందుగా కథలు నాగేశ్వరరావుకి వినిపించారు. ఈ కథను విన్నటువంటి నాగేశ్వరరావు చాలా బాగుంది ఈ సినిమాలో మా అబ్బాయి చేస్తారని చెప్పారు.
Advertisement
అలా సంకీర్తన మూవీలో నాగార్జున ఆయనకు జోడీగా రమ్యకృష్ణ నటించారని దర్శకుడు వెల్లడించారు. ఇదిలా ఉండగా నాగార్జున నటించినటువంటి విక్రమ్ సినిమా అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ లో తెరకేక్కింది. అయితే అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ పై గత 23 ఏళ్ల నుంచి చిరంజీవి డేట్స్ కొరకు ఎదురు చూస్తూ అతని చుట్టూ తిరుగుతున్నారు.
మెగాస్టార్ పై కోపంతోనే..?
ఈ విధంగా చిరంజీవి డేట్ దొరకక పోవడం వల్ల విసుగు చెందినటువంటి ఏఎన్ఆర్ అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ లో విక్రమ్ మూవీని పరిచయం చేశారని ఈ సందర్భంగా తెలియజేశారు. అంటే చిరంజీవి కోసం ఎదురు చూసి విసుగు చెందినటువంటి ఏఎన్ఆర్ చివరికి నాగార్జున తన బ్యానర్ లో హీరోగా పరిచయం చేశారని వెల్లడించారు.
also read;
“గంగోత్రి” సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా..? ఆ ఒక్క కారణంతో…!
టాలీవుడ్ లో విజయశాంతిని దారుణంగా అవమానించారు…సంచలన నిజాలు బయటపెట్టిన నటుడు..!