Home » “గంగోత్రి” సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ డైరెక్ట‌ర్ ఎవ‌రో తెలుసా..? ఆ ఒక్క కార‌ణంతో…!

“గంగోత్రి” సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ డైరెక్ట‌ర్ ఎవ‌రో తెలుసా..? ఆ ఒక్క కార‌ణంతో…!

by AJAY
Published: Last Updated on
Ad

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప‌రిచ‌మైన సినిమా గంగోత్రి. 2003లో ఈ ఎన్నో అంచ‌నాల మ‌ధ్య ఈ సినిమా ప్రేక్ష‌కుల మ‌ధ్య‌కు వ‌చ్చింది. ఈ సినిమాకు ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు తెర‌కెక్కించారు. ఈ సినిమా అల్లు అర్జున్ కు మాత్రమే కాకుండా హీరోయిన్ గా న‌టించిన అదితి అగ‌ర్వాల్ కు కూడా మొదటి సినిమానే కావ‌డం విశేషం. ఈ చిత్రానికి టాప్ ర‌చ‌యిత చిన్ని కృష్ణ క‌థ‌ను అందించారు.

Advertisement

అంతే కాకుండా ఎం ఎం కీర‌వాణి ఈ సినిమాకు స్వ‌రాలు స‌మ‌కూర్చ‌గా ఈ చిత్రంలోని పాట‌న్నీ శ్రోత‌ల‌ను ఆక‌ట్టుకున్నాయి. దాంతో ఈ సినిమా మ్యూజిక‌ల్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలోని పాటలు హిట్ అవ్వ‌డంతో విడుద‌ల‌కు ముందే భారీ అంచనాలు నెల‌కొన్నాయి. అలా ఎన్నో అంచనాల మ‌ధ్య ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. అయితే ఈ సినిమాలో న‌టించే వ‌హించే అవ‌కాశం టాప్ డైరెక్ట‌ర్ బాబీకి వ‌చ్చింది.

Advertisement

గంగోత్రి సినిమా స‌మయంలో బాబీ చిరంజీవి ఫ్యాన్స్ అభిమానం సంఘం అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లను స్వీక‌రించాడు. ఇక అప్పుడు ర‌చ‌యిత చిన్ని కృష్ణ‌ను బాబీ క‌ల‌వ‌గా త‌న‌కు ఏదైనా అవ‌కాశం ఇప్పించాల‌ని బాబీ కోరారు. దాంతో చిన్ని కృష్ణ తీసుకువెళ్లి రాఘ‌వేంద్ర‌రావు కు ప‌రిచ‌యం చేశార‌ట‌. గంగోత్రి సినిమా షూటింగ్ జ‌రుగుతుండ‌టంతో రాఘ‌వేంద్ర‌రావు అసిస్టెంట్ ను పిలిపించి బాబీకి నిక్క‌ర్ కుట్టించాల‌ని కొల‌త‌లు తీసుకోండ‌ని చెప్పార‌ట‌.

అల్లు అర్జున్ కు ఫ్రెండ్ గా బాబీని తీసుకోవాల‌ని ద‌ర్శ‌కుడు అనుకున్నాడు. అయితే సినిమాల్లో నిక్క‌ర్ వేసుకుంటే గుంటూరు లో త‌న ప‌రువు పోతుంద‌ని భావించిన బాబీ సినిమా చేయ‌న‌ని చెప్పాడ‌ట‌. కానీ అదే సినిమాకు సీన్లు రాసే ఛాన్స్ ను ద‌క్కించుకున్నాడు. ఇదిలా ఉంటే అలా వ‌చ్చిన బాబీ బలుపు, జై ల‌వ‌కుశ లాంటి సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించి స్టార్ డైరెక్ట‌ర్ గా ఎదిగారు.

Also Read: టాలీవుడ్ లో విజ‌య‌శాంతిని దారుణంగా అవ‌మానించారు…సంచ‌ల‌న నిజాలు బ‌య‌ట‌పెట్టిన న‌టుడు..! 

“ఏఎన్ఆర్” నాగార్జునను హీరో చేయడానికి కారణం చిరంజీవి అంటూ.. షాకింగ్ కామెంట్స్ చేసిన దర్శకుడు గీతాకృష్ణ..?

Visitors Are Also Reading