Home » Chiranjeevi: చిరంజీవి ఇంట్లో షూటింగ్ జరుపుకున్న టాలీవుడ్ సినిమాలు ఇవే.. ఏంటో చూడండి!

Chiranjeevi: చిరంజీవి ఇంట్లో షూటింగ్ జరుపుకున్న టాలీవుడ్ సినిమాలు ఇవే.. ఏంటో చూడండి!

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

బాగా పాపులర్ అయిన సెలెబ్రెటీలకు, స్టార్ హీరోలకు సొంత ఇంటితో పాటు గెస్ట్ హౌస్ లు ఉండడం చాలా సాధారణ విషయమే. అవసరం అయినప్పుడు.. ఈ గెస్ట్ హౌస్ లను షూటింగ్ లకు కూడా ఇస్తూ ఉంటారు. అయితే.. మెగాస్టార్ చిరంజీవికి కూడా చెన్నై లో ఓ గెస్ట్ హౌస్ ఉండేది. ఆయన ఇంట్లో శుభకార్యాలు అన్నిటిని ఆ గెస్ట్ హౌస్ లోనే జరుపుకునేవారు. అయితే.. ఆయన కుటుంబం హైదరాబాద్ కు షిఫ్ట్ అయిపోయాక.. ఆ గెస్ట్ హౌస్ ను వాడడం తగ్గించేశారు.

Advertisement

ఈ గెస్ట్ హౌస్ ను వారు హనీ హౌస్ అని పిలుచుకుంటారు. ఎప్పుడైనా చెన్నై వెళ్ళినపుడు ఆ హనీ హౌస్ ని ఓ సారి చూసుకుని వస్తుంటారు. దీనిపై అంత శ్రద్ధ పెట్టడం అయితే తగ్గించారని చెప్పవచ్చు. కానీ, సినిమాలలో అవసరమైన వారికి ఈ గెస్ట్ హౌస్ ని షూటింగ్ జరుపుకోవడానికి అద్దెకి ఇచ్చేవారు. గత మూడు దశాబ్దాల కాలం నుంచి ఈ గెస్ట్ హౌస్ లో చాలా సినిమాలే షూటింగ్ జరుపుకున్నాయి.

Advertisement

ఈ గెస్ట్ హౌస్ లో షూటింగ్ జరుపుకుంటే.. ఆ సినిమా సూపర్ హిట్ గా నిలుస్తుంది అని టాక్ కూడా ఉంది. ఈ హౌస్లో ఎక్కువగా హిట్ సినిమాలు బాలకృష్ణవే. అసలు బాలకృష్ణ సినిమా అంటే ఫైట్స్ కచ్చితంగా ఉండాలి. కానీ ఎలాంటి ఫైట్స్ లేకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ కొట్టిన సినిమా నారీ నారీ నడుమ మురారి. హలో బ్రదర్, గొప్పింటి అల్లుడు , సుస్వాగతం,ఎన్టీఆర్ మేజర్ చంద్ర కాంత్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, గోకులం లో సీత, ఇలా చెప్పుకుంటే చాలా సినిమాలు చిరంజీవి గెస్ట్ హౌస్ లోనే షూటింగ్ పూర్తి చేసుకున్నాయి.

మరిన్ని..

రజినీకాంత్ వైసీపీ నేతలను టార్గెట్ చేయడానికి కారణం ఏంటో తెలుసా ?

Suryakantham and chayadevi : సూర్యకాంతం – ఛాయాదేవి మధ్య ఉన్న ప్రతిజ్ఞ ఏమిటో తెలుసా..?

Visitors Are Also Reading