Home » Breaking : యూపీ నుండి రాజ్యసభ కి చిరంజీవి..!

Breaking : యూపీ నుండి రాజ్యసభ కి చిరంజీవి..!

by Sravya
Ad

లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. దీంతో రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నాయి. రాబోయే లోక్సభ ఎన్నికల్లో సత్తా చాట్టడానికి సిద్ధమవుతున్నారు అంతా. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఇంకో సారి విజయాన్ని సాధించి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది. ఈ క్రమంలోనే ఏపీపై ప్రధానంగా ఫోకస్ ని పెట్టింది అక్కడ ప్రాంతీయ పార్టీ అయిన పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేనతో పొత్తు పెట్టుకుంది. ఇదిలా ఉంటే ప్రధాన నరేంద్ర మోడీ పై ఉన్న అభిమానాన్ని ఓట్ల రూపంలో రాబట్టడానికి ప్లాన్ వేశారు.

Advertisement

Advertisement

ఏపీలోని కాపు సామాజిక వర్గాన్ని ఓటు బ్యాంకుగా మలుచుకోవడానికి మెగాస్టార్ చిరంజీవిని బిజెపి తరఫున రాజ్యసభ కి పంపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఏపీ బీజేపీలో కొత్త ఊపు వస్తుందని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు దీనిలో భాగంగానే రామ మందిర ప్రాణ ప్రతిష్టకి హాజరుకావాలని ప్రత్యేక ఆహ్వానాన్ని పంపారు. అలానే పద్మ విభూషణ్ పురస్కారాన్ని ఇచ్చారు. ఇప్పటిదాకా రాజ్యసభ సభ్యుడుగా కొనసాగిన జీవుల నరసింహారావు స్థానంలో చిరంజీవిని పెద్దలు సభకి పంపించబోతున్నట్లు తెలుస్తోంది బీహార్ లో కూడా బిజెపి సరిగ్గా ఇటువంటి ఫార్ములానే అమలు చేసింది.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading