Home » చిరంజీవిని తీసేసి ఆ హీరోను పెట్టుకోమని దాసరి గారు అన్నారు..!

చిరంజీవిని తీసేసి ఆ హీరోను పెట్టుకోమని దాసరి గారు అన్నారు..!

by AJAY

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి… ఎన్నో మూవీలలో నటించి టాలీవుడ్ సినీ ప్రస్థానంలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ను కలిగి ఉన్న దాసరి నారాయణరావు గారి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దాసరి శిష్యుడు అయినటువంటి దవల సత్యం గురించి కూడా మనం ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

ఈయన ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూలో భాగంగా దవల సత్యం మాట్లాడుతూ … నేను మొదటి సినిమా చేయాలి అనుకున్నప్పుడు చిరంజీవి ని నా మూవీలో హీరోగా అనుకున్నాను.

అదే విషయాన్ని మా గురువు గారు అయినటువంటి దాసరి నారాయణరావు గారికి చెప్పాను. అప్పుడు ఆయన అంత కొత్త వాళ్ళతో సినిమా రిస్క్ అవుతుంది… ఈ సినిమాలో చిరంజీవి ని తీసేసి మన దగ్గర డేట్స్ ఉన్నటువంటి చంద్రమోహన్ ను తీసుకుంటే బాగుంటుంది అని సలహా ఇచ్చారు. అయితే అప్పటికే శివరంజని సినిమా ఆడిషన్ కి వచ్చిన చిరంజీవి నటన చూసిన సత్యం ఆ రోజే తనతో హీరోగా మూవీ ని చేయాలని అనుకున్నారట.

అలా అప్పుడే చిరంజీవిని హీరోగా తీసుకోవాలి అని డిసైడ్ అవ్వడంతో చిరంజీవి పై “జాతర” మూవీని తెరకెక్కించాడు. ఇలా తన గురువు దాసరి నారాయణరావు గారు చెప్పినప్పటికీ నేను మాత్రం చిరంజీవి కచ్చితంగా గొప్ప నటుడు అన్న ఉద్దేశంతోనే అతనిని సినిమాలో హీరోగా తీసుకున్నట్లు తాజా ఇంటర్వ్యూలో సత్యం చెప్పుకొచ్చాడు.

Visitors Are Also Reading