ఉక్రెయిన్ రష్యా మధ్య వార్ తీవ్ర స్థాయిలో జరుగుతుంది. కీలకమైన నగరాలను రష్యా ఒక్కొక్కటిగా ఆక్రమించుకుంటూ వస్తుంది. అయితే కీవ్‌కు సమీపంలో రష్యా సేనలు ప్రవేశించడంతో భీకర పోరు జరుగుతున్న సంగతి తెలిసినదే. ఉక్రెయిన్‌లో సుమారు 6వేల మందికీ పైగా చైనీయులున్నారు. వీరంతా ఇప్పడు దేశంలోనే చిక్కుకుపోయారు. అక్కడి నుంచి సురక్షితంగా తరలించేందుకు ఎలాంటి అవకాశాలు లేవని, కీవ్ నగరంలో ఉన్న చైనీయులు అర్ధం చేసుకోవాలని చైనా రాయబారి ఫ్యాన్ షియాన్‌రాంగ్ పేర్కొన్నారు.
Also Read : అష్షు, అరియానా కాదు….ఆ బ్యూటీకే తన సపోర్ట్ అంటున్న వర్మ..!
Advertisement
Advertisement
నగరంలో ప్రతీ చైనీయుడిని సురక్షితంగా సొంత ప్రాంతాలకు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నాం అన్నారు. స్థానికులతో ఎలాంటి గొడవలు పెట్టుకోవద్దు అని ఉక్రెయిన్ ప్రజలు ప్రస్తుతం ఆందోళనకర స్థితిలో ఉన్నారని, వారిని మానవతాదృక్పథంలో అర్ధం చేసుకోవాలని చైనా రాయబారి ఫ్యాన్ షియాన్ రాంగ్ పేర్కొన్నారు. ఎక్కడి వారు అక్కడే ఉండిపోవాలని రాయబారి ఫ్యాన్ తెలియజేసారు.
Also Read : కమెడియన్ విజయ్ సాయి ఆత్మహత్యకు కారణం అదే : అవసరాల శ్రీనివాస్