Home » క‌మెడియ‌న్ విజ‌య్ సాయి ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణం అదే : అవ‌స‌రాల శ్రీనివాస్.

క‌మెడియ‌న్ విజ‌య్ సాయి ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణం అదే : అవ‌స‌రాల శ్రీనివాస్.

by AJAY
Ad

అష్టాచెమ్మా సినిమాతో టాలీవుడ్ ప‌రిచ‌య‌మైన న‌టుడు అవ‌స‌రాల శ్రీనివాస్. మొద‌టి సినిమాతోనే అవ‌స‌రాల శ్రీనివాస్ ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా త‌ర‌వాత వ‌రుస ఆఫ‌ర్ లు అందుకున్నాడు. ద‌ర్శ‌కుడిగా ర‌చ‌య‌త‌గా కూడా అవ‌స‌రాల శ్రీనివాస్ టాలెంట్ ను నిరూపించుకున్నాడు. కానీ న‌టుడిగానే ఎక్కువ స‌క్సెస్ అయ్యాడు. ముఖ్యంగా కామెడీ పాత్ర‌ల‌తో అవ‌స‌రాల శ్రీనివాస్ ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు.

Advertisement

అష్టాచెమ్మా త‌ర‌వాత ఊహ‌లు గుస‌గుస‌లాడే, అమితుమి సినిమాల‌తోనూ నవ్వించాడు. ఇటీవ‌ల అవ‌స‌రాల శ్రీనివాస్ నూటొక్క జిల్లాల అంద‌గాడు సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. సినిమాలో బ‌ట్ట‌తల ఉండే యువ‌కుడి క‌ష్టాలు ఎలా ఉంటాయి…ఆ క‌ష్టాల‌ను ఎలా అదిగ‌మిస్తాడు అన్న‌దాన్ని చూపించాడు.

Advertisement

ఇదిలా ఉండ‌గా అవ‌స‌రాల శ్రీనివాస్ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు. అవ‌స‌రాల శ్రీనివాస్ వ‌ర‌ప్ర‌సాద్ పొట్టి ప్ర‌సాద్ అనే సినిమాలో న‌టించారు. అయితే ఈ సినిమాలో విజ‌య్ సాయి కూడా న‌టించిన సంగ‌తి తెలిసిందే. విజ‌య్ సాయి చిన్న వ‌య‌సులోనే ఆత్మ‌చేసుకున్నారు.

ALSO READ : ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ కు సీఎం జ‌గ‌న్ మంచి చేశారు..ఎమ్మెల్యే రోజా స్ట్రాంగ్ కౌంట‌ర్..!

అయితే విజ‌య్ సాయి మ‌ర‌ణ‌వార్త విని తాను షాక్ అయ్యాన‌ని అన్నారు. విజ‌య్ సాయికి ఆర్థికంగా ఏవో కార‌ణాలు ఉండ‌టం వ‌ల్ల ఆత్మ‌హత్య చేసుకున్నార‌ని అన్నారు. విజ‌య్ సాయి అలా చేస్తాడ‌ని అనుకోలేని ఈ ఘ‌ట‌న‌తో చాలా నేర్చుకున్నాన‌ని చెప్పారు. ఇండ‌స్ట్రీలో కొంత‌మంది పైకి క‌నిపించేంత జాలీగా…ఆనందంగా ఉండ‌ని అన్నారు. దాని వెన‌క ఎంతో శ్ర‌మ ఉంద‌ని చెప్పారు.

Visitors Are Also Reading