చికోటి ప్రవీణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎవరి ఫోన్ తీసిన… ఎవరి ఫోన్ చూసినా… పాములను మెడలో వేసుకొని దర్శనమిస్తాడు ఈ చీకోటి ప్రవీణ్. జంతువులను ఎక్కువగా ప్రేమించే ఈ ప్రవీణ్… వాటి కోసం ప్రత్యేకంగా ఒక డెన్ ను ఏర్పాటు చేశాడు. అలాగే ఇటీవల క్యాసినో కేసులో ఈడి విచారణను కూడా ఎదుర్కొన్నాడు ప్రవీణ్.
read also : Mahesh Babu : దుబాయ్ లో కోట్లు పెట్టి… విల్లా కొన్న మహేష్ బాబు!
Advertisement
ఇది ఇలా ఉండగా తాజాగా చీకోటి ప్రవీణ్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇవాళ థాయిలాండ్ పోలీసులు చీకోటి ప్రవీణ్ ను అరెస్టు చేశారు. గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నాడని కారణంతో ఆయనను అరెస్టు చేశారు. చికోటి ప్రవీణ్ తో పాటు మాధవరెడ్డి, దేవేందర్ రెడ్డిలను కూడా ఇవాళ అరెస్టు చేశారు థాయిలాండ్ పోలీసులు. పెద్ద మొత్తంలో గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్న 93 మంది ముఠాను థాయిలాండ్ పోలీసులు అరెస్టు చేశారు.
Advertisement
Read also : ఆ ప్రైవేట్ ప్లేస్ లో టాటూ వేయించుకున్న సంయుక్త మీనన్…అతని పేరు వేయించుకుందా !
అరెస్టు అయిన వారిలో 71 మంది పురుషులు అలాగే 16 మంది మహిళలు ఉన్నారని పోలీసులు వివరించారు. నిందితుల నుంచి భారీగా నగదు తో పాటు గేమింగ్ చిప్స్ కూడా థాయిలాండ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 20 కోట్ల విలువ చేసే గేమింగ్ చిప్స్ ను స్వాధీనం చేసుకున్నారు థాయిలాండ్ పోలీసులు. గ్యాంబ్లింగ్ లో ఓ మహిళ కీలకంగా వ్యవహరించింది. అయితే ఏప్రిల్ 27న థాయిలాండ్ కు వెళ్లిన ప్రవీణ్…. ఇవాళ అక్కడి పోలీసులకు ఈ కేసులో చిక్కుకున్నాడు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ వార్త వైరల్ గా మారింది. ఇక ఈ కేసు గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also : ఇదేందయ్యా ఇది… 65 ఏళ్ల వయసులో 16 ఏళ్ల అమ్మాయితో మేయర్ పెళ్లి