Home » పెళ్లిమండ‌పంలోకి గ్రాండ్ ఎంట్రీ ప్లాన్ చేసిన జంట‌..కానీ క్రేన్ అడ్డంతిర‌గ‌టంతో….!

పెళ్లిమండ‌పంలోకి గ్రాండ్ ఎంట్రీ ప్లాన్ చేసిన జంట‌..కానీ క్రేన్ అడ్డంతిర‌గ‌టంతో….!

by AJAY
Ad

ప్ర‌స్తుతం పెళ్లిళ్ల‌ సీజ‌న్ న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. డిసెంబ‌ర్ నెల వ‌చ్చిదంటే వ‌రుస పెళ్లిళ్లు జ‌రుగుతూ ఉంటాయి. ఇక ప్ర‌స్తుతం ప‌లు బాలీవుడ్ జంట‌లు కూడా పెళ్లిళ్లు చేసుకుని ఒక్క‌ట‌వుతున్నాయి. బ‌య‌ట‌ ఎక్క‌డ చూసినా గ్రాండ్ వెడ్డింగ్ లు ద‌ర్శ‌నం ఇస్తున్నాయి. అయితే కొన్ని జంట‌లు పెళ్లి మండ‌పంలోకి లేదా రిసెప్ష‌న్ స్టేజిపికి న‌డుచుకుంటూ వస్తారు కానీ కొంత మంది స్టేజిపైకి డిఫ‌రెంట్ గా ఎంట్రీ ఇవ్వాల‌ని అనుకుంటారు. తామ ఎంట్రీనే ఆ పెళ్లికి హైలెట్ గా నిల‌వాలని ప‌ది మంది త‌మ పెళ్లిలో ఎంట్రీ గురించే మాట్లాడుకోవాల‌ని అనుకుంటారు.

Advertisement

Advertisement

అయితే తాజాగా ఓ జంట అలానే అనుకుని బొక్క బోర్లా ప‌డ్డారు. స్టేజిపైకి ఓ క్రేన్ నుండి దిగుతున్న సమ‌యంలో క్రేజ్ చైన్ ఊడిపోవ‌డంతో ఇద్ద‌రూ ఒక్క‌సారిగా స్టేజిపై ప‌డిపోయారు వివ‌రాల్లోకి వెళితే….ఈ ఘ‌ట‌న రాయ్ పూర్ లోని ఛ‌త్తీస్ గ‌డ్ లోన రాయ్ పూర్ లో చోటు చేసుకుంది. రాయ్ పూర్ లోని ఓ హోట‌ల్ లో పెళ్లి కొడుకు మ‌రియు పెళ్లి కూతురు స్టేజిపైకి ఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఇటీవ‌ల కాలంలో క్రేన్ ల స‌హాయంతో కొత్త జంట‌లు స్టేజిపైకి క్రేన్ ల స‌హాయంతో దిగుతూ పెళ్లికి వ‌చ్చిన అతిధుల‌ను అక‌ట్టుకుంటున్నారు.

కానీ అలానే గ్రాండ్ గా స్టేజ్ పైకి ఎంట్రీ ఇవ్వాల‌నుకున్న ఈజంట ఆశ‌లు మాత్రం ఒక్క‌సారిగా ఆవిరి అయిపోయాయి. స్టేజ్ పైకి క్రేన్ తో దిగుతున్న స‌మ‌యంలో అనుకోకుండా క్రేన్ కు ఏదో సాంకేతిక లోపం వ‌ల్ల చైన్ ఒక‌వైపు ఊడిపోయింది. దాంతో వాళ్లు కూర్చుకున్న భాగం త‌ల‌కిందులు అయ్యింది. ఒక్క‌సారిగా ఇద్ద‌రూ స్టేజిపై ప‌డిపోయారు. అక్క‌డే ఉన్న అతిధులు అంద‌రూ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి వారిని పైకి లేపారు. ఇక ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు దీనికంటే న‌డుచుకుంటే వ‌స్తేనే గ్రాండ్ గా ఉండేదేమో అంటూ ఫ‌న్నీ కామెంట్లు పెడుతున్నారు.

Visitors Are Also Reading