Home » చాణక్యనీతి : ఈ విషయాలు సీక్రెట్ గా ఉంచకపోతే సమస్యలు తప్పవట..!

చాణక్యనీతి : ఈ విషయాలు సీక్రెట్ గా ఉంచకపోతే సమస్యలు తప్పవట..!

by AJAY
Ad

ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతి ద్వారా ఎన్నో గొప్ప విషయాలను బోధించిన సంగతి తెలిసిందే. ఆర్థికంగా ఎదగాలంటే ఏం చేయాలి.. ఎలా ఉంటే సమస్యలు దూరమవుతాయి. ఇలాంటి ఎన్నో విషయాలను ఆచార్య చాణక్యుడు తన చాణక్యనీతి ద్వారా ప్రజలకు తెలియజేశాడు. చాణక్యుడు చెప్పిన ఎన్నో విషయాలను ప్రజలు ఇప్పటికీ ఆచరిస్తూ సుఖవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు.

Advertisement

అందువల్లే చాణక్య నీతిని చాలా మంది విశ్వసిస్తూ ఉంటారు. కష్టాలు రాకుండా ఉండాలంటే కొన్ని విషయాలను గోప్యంగా ఉంచుకోవాలని చెప్పాడు. ఆ విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం…. పెళ్లి తర్వాత వైవాహిక జీవితంలో భార్య భర్తలు తమ మధ్య జరిగే కొన్ని విషయాల్ని మూడో వ్యక్తికి చెప్పకూడదని చాణక్యుడు తెలిపాడు.

Advertisement

వారు మాట్లాడుకున్న మాటలు… చర్చించిన అంశాలను ఇతరులకు చెప్పకూడదని తెలిపాడు. దాంతో వైవాహిక జీవితంలో సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించాడు. అదేవిధంగా మనలో ఏవైనా లోపాలు ఉన్నా వాటిని ఇతరులకు చెప్పకూడదని తెలిపాడు.

chanakya nithi

chanakya nithi

మనలో ఉన్న లోపాలను ఇతరులకు చెప్పడం ద్వారా వారికి చులకన అవుతామని పేర్కొన్నాడు. ఉద్యోగం లేదా వ్యాపారం లో వచ్చే లాభ నష్టాల గురించి కూడా గోప్యంగా ఉంచుకుంటేనే మంచిదని చెప్పాడు. లేదంటే నష్టపోయే ప్రమాదం ఉందని చాణక్యుడు హెచ్చరించాడు.

Visitors Are Also Reading