Home » అల్లు అర్జున్ అంత కట్నం తీసుకున్నాడా..? చంద్రశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

అల్లు అర్జున్ అంత కట్నం తీసుకున్నాడా..? చంద్రశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

by Anji
Ad

సాధారణంగా సెలబ్రిటీలకు సంబంధించి ఏ చిన్న విషయమైనా తెలుసుకోవాలని ఆత్రుత ఉంటుంది. ముఖ్యంగా స్టార్ హీరో హీరోయిన్లకు సంబంధించి చిన్న విషయం ఏదైనా బయటికి వచ్చిన అభిమానులు తెలుసుకునేందుకు ఎంతో ఆసక్తి కనబరుస్తుంటారు. ఇక అందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ మధ్యనే పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు అల్లు అర్జున్. ఆయన పర్సనల్ విషయాల గురించి తెలుసుకోవాలని చాలామందికి ఎంతో ఆసక్తి ఉంటుంది. అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోల్లో ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి వారి పెళ్లికి సంబంధించిన విషయాలు ఎప్పుడూ సోషల్ మీడియాలో   వైరల్ అవుతూనే ఉంటాయి. అదేవిధంగా వీరి పెళ్లి సమయంలో  కోట్లాది రూపాయల కట్నాలు తీసుకున్నారనే వార్తలు కూడా తరచూ వినిపిస్తుంటాయి. ఇందులో రామ్ చరణ్ భార్య ఉపాసన నుంచి భారీగా కట్నకానుకలు వచ్చాయని.. అందరికంటే ఎక్కువ కట్నం రామ్ చరణ్ తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

 

ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కట్నం గురించి ఆసక్తికరమైన విషయం చెప్పాడు. “అల్లుడి కుటుంబానికి వేలాది కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని.. వారికి మేము కట్నం ఇవ్వాల్సిన అవసరం ఏముంది. నేను నా కూతురు స్నేహారెడ్డి ని అల్లు అర్జున్ కి ఇచ్చి పెళ్లి చేసినప్పుడు ఒక రూపాయి కూడా కట్నం ఇవ్వలేదు. వారు ఇవ్వమని కూడా అడగలేదు” అని ఎవరికీ తెలియని విషయాలను అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి బయట పెట్టారు. ఈ తరుణంలోనే అల్లు అర్జున్ అభిమానులు అందరూ మా హీరోనే గ్రేట్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

ఉదయ్ కిరణ్ సినిమాలో నటించిన వారంతా మరణించారనే విషయం మీకు తెలుసా ?

వరలక్ష్మి శరత్ కుమార్ విలన్ గా మారటానికి కారణం ఏంటో తెలుసా?

 దగ్గుబాటి రానా భార్య మిహికా బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు!

Visitors Are Also Reading