Home » చంద్రబాబు నాయుడు కోరిక తీర్చిన JR.ఎన్టీఆర్..మామ మాటపై కట్టుబడి ఉన్నాడా..?

చంద్రబాబు నాయుడు కోరిక తీర్చిన JR.ఎన్టీఆర్..మామ మాటపై కట్టుబడి ఉన్నాడా..?

by Sravanthi
Ad

తెలుగు రాష్ట్రాల్లో నందమూరి ఫ్యామిలీ మరియు నారా ఫ్యామిలీ అంటే ఎంతటి గౌరవ మర్యాదలు ఉంటాయో మనందరికీ తెలుసు. ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీ నట వారసత్వాన్ని బాలకృష్ణ ఎన్టీఆర్ కొనసాగిస్తూ వస్తున్నారు. ఇక రాజకీయ వారసత్వాన్ని పూర్తిస్థాయిలో SR.ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు నాయుడు కొనసాగిస్తూ వస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ మధ్యకాలంలో సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్ ఎట్టి పరిస్థితుల్లో రాకుండా చేయడం కోసం చంద్రబాబు ఒక ప్రత్యేకమైన ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. మామ మాట ప్రకారమే జూనియర్ ఎన్టీఆర్ కూడా నడుచుకున్నట్టు సమాచారం అందుతుంది.

Advertisement

ఇంతకీ ఏం జరిగిందంటే.. శతజయంతి ఉత్సవాలకు టిడిపి జూనియర్ ఎన్టీఆర్ ను ఆహ్వానిస్తున్నట్లు సమాజం దృష్టిలో క్రియేట్ చేసింది. ఇదే టైంలో ఆయన రాలేదని మరో పరిస్థితి క్రియేట్ చేయాలని ప్లక్కా ప్లాన్ ప్రకారమే జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను హైదరాబాదులో నిర్వహించారు. పక్క ప్లాన్ ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు నాడే శతజయంతి వేడుకలను హైదరాబాదులో నిర్వహించారు. దీంతో ముందస్తు షెడ్యూల్ ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు రాలేనని చెప్పేశారు. ఆయన రాకపోవడంతో సీనియర్ ఎన్టీఆర్ అభిమానులకు కాస్త నిరాశ కలిగిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు, బాలయ్య,లోకేష్ తదితరులకు సంతోషాన్ని నింపినట్టు టిడిపి వర్గాల్లో చర్చ సాగుతోంది.

Advertisement

ఇలా ఎన్టీఆర్ ను దూరం పెట్టడానికి ప్రధాన కారణం కూడా ఉంది, ప్రస్తుతం టిడిపి రాబోవు ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని శతవిధాల ప్రయత్నాలు చేస్తోంది. లోకేష్ బాధ్యతలు తీసుకొని ముందుకు సాగుతున్నారు. కానీ ప్రజలను ఆకట్టుకునే సత్తా లోకేష్ కి అంతగా లేకపోవడంతో టిడిపి శ్రేణులే జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకువస్తే తప్పనిసరిగా అధికారంలోకి వస్తామని చంద్రబాబు నాయుడుకు తెలిపినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో ఎన్టీఆర్ ను ముందస్తుగానే పైకి రాకుండా లోలోపలే ఒత్తేస్తున్నట్టు తెలుస్తోంది.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు:

 

Visitors Are Also Reading