Home » కార్తికేయ 3 ఎప్పుడో చెప్పిన డైరెక్టర్..!

కార్తికేయ 3 ఎప్పుడో చెప్పిన డైరెక్టర్..!

by Azhar
Ad

టాలీవుడ్ యువ హీరోలలో ఒక్కడైనా నిఖిల్ సిద్ధర్థ్ నటించిన కార్తికేయ 2 సినిమా గత నెల 13న విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే గతంలో కార్తికేయ అనే సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా వచ్చింది. కానీ ఈ సినిమాను తెలుగులోనే కాకుండా.. హిందీలో కూడా విడుదల చేసారు. ఎటువంటి అంచనాలు లేకున్నాడా హిందీలో ఎంట్రీ ఇచ్చిన కార్తికేయ 2 సినిమా సూపర్ హిట్ అయ్యింది.

Advertisement

హిందీలోని పెద్ద పెద్ద హీరోల సినిమాలను కూడా వెన్నకి నెట్టి.. కలెక్షన్స్ అనేవి అందుకుంది. ఈ సినిమా మొత్తం 120 కోట్లకు పైగానే వసూల్ చేసింది. అయితే ఈ సినిమాకు కూడా సీక్వెల్ గా కార్తికేయ 3 అనే సినిమా ఉంటుంది అని.. కార్తికేయ 2 క్లైమాక్స్ లో క్లారిటీగా చెప్పారు. బయట కూడా దర్శకుడు చందు మొండేటి అలాగే హీరో నిఖిల్ కూడా ప్రకటించాడు.

Advertisement

అయితే ఈ సినిమా కార్తికేయ 3 పై డైరెక్టర్ చందు క్లారిటీ ఇచ్చాడు. అందరూ కార్తికేయ 3 ఆలస్యం అవుతుంది అనుకుంటున్నారు.. కానీ వీలైనంత తొందరగా.. ఆ సినిమా షూటింగ్ అనేది మేము ప్రారంభిస్తాం అని అన్నాడు. ప్రస్తుతం నిఖిల్ కమిట్ అయ్యిన అన్ని సినిమాలు పూర్తి అయిన వెంటనే.. ఈ సినిమా అనేది స్టార్ట్ అవుతుంది అని.. వీలైనంత తొందరగా ఈ కార్తికేయ 3 సినిమాను ఫ్యాన్స్ ముందుకు పాన్ ఇండియా లెవల్ లో తీసుకువస్తాం అని చెప్పాడు.

ఇవి కూడా చదవండి :

బుమ్రా ఫిట్ గా లేడా.. ఫ్యాన్స్ ఆగ్రహం..!

తన తప్పును జట్టు మొత్తం మీద నెడుతున్న రాహుల్..?

Visitors Are Also Reading