Telugu News » Blog » బుమ్రా ఫిట్ గా లేడా.. ఫ్యాన్స్ ఆగ్రహం..!

బుమ్రా ఫిట్ గా లేడా.. ఫ్యాన్స్ ఆగ్రహం..!

by Manohar Reddy Mano
Ads
భారత జట్టుకు మూడు ఫార్మాట్ లో ఫాస్ట్ బౌలింగ్ ను ముందుండి నడిపిస్తున్నాడు బుమ్రా. కానీ ఈ ఏడాది ఇండియా వెళ్లిన ఇంగ్లాండ్ పర్యటనలో బుమ్రాకు గాయం అయ్యింది. దాంతో తర్వాత టీం ఇండియాకు ఎంపిక కానీ బుమ్రా.. ఆసియా కప్ లో కూడా ఆడలేదు. కానీ ఆసియా కప్ ముగిసే సమయానికి బుమ్రా కోలుకున్నాడు అని.. ఫిట్నెస్ సాధించాడు అని బీసీసీఐ ప్రకటించింది.
అందుకే అతడిని వచ్చే నెలలో జరిగే ప్రపంచ కప్ తో పాటుగా.. ఈరోజు ఆస్ట్రేలియాతో ఆరంభం అయిన టీ20 సిరీస్ కూడా ఎంపిక చేసారు. ఇక బుమ్రా రాకతో భారత ఫ్యాన్స్ ఆఅంధం వ్యక్తం చేసారు. కానీ దానిని బీసీసీఐ వెంటనే కోపంలోకి మలుచుకుంది. ఈరోజు ఆసీస్ తో జరుగుతున్న మొదటి టీ20 మ్యాచ్ యొక్క తుది జట్టులో బుమ్రా లేడు.
అయితే ఈ విషయంలో మ్యాచ్ కు ముందు కెప్టెన్ రోహిత్ మాట్లాడుతూ.. బుమ్రా ఇంకా కోలుకోలేదు అని.. అందుకే తీసుకోలేదు అని చెప్పాడు. అంతే.. ఫిట్ గా లేని బుమ్రాను ఎందుకు ఈ సిరీస్ కు ఎంపిక చేసారు అని ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. ఇలా బుమ్రాను కోలుకోకముందే జట్టులోకి తీస్తే.. ప్రపంచ కప్ సమయానికి అతను మళ్ళీ గాయపడే అవకాశాలు ఉన్నాయి అని.. దాంతో ఆసియా కప్ లో ఎదురైనా పరాభవం మళ్ళీ ఇండియాకు తప్పదు అని కామెంట్స్ చేస్తున్నారు.