Home » CHANAKYANITHI: ఇలా చేస్తే ఇత‌రుల‌ను వ‌శ‌ప‌రుచుకోవ‌చ్చు..!

CHANAKYANITHI: ఇలా చేస్తే ఇత‌రుల‌ను వ‌శ‌ప‌రుచుకోవ‌చ్చు..!

by AJAY
Ad

ఒక మ‌నిషిని అంచ‌నా వేయ‌డంలో చాణ‌క్యుడిని మించినోడు లేడు. త‌న అనుభ‌వం జ్ఞానంతోనే మ‌న‌కు చాణ‌క్యుడు చాణ‌క్య‌నీతిని అందించాడు. చాణ‌క్యుడి నీతిలోని ముఖ్య‌మైన గ్రంథం మ‌న‌స్త‌త్వ‌ శాస్త్రం. ఈ గ్ర‌థంలో మ‌నిషిని ఎలా అర్థం చేసుకోవాలి..ఎవ‌రితో ర‌హ‌స్యాలు చెప్పాలి. కుటుంబ సభ్య‌లతో ఎలా న‌డుచుకోవాలి ఇలా ఎన్నో విష‌యాల‌ను తెలిపాడు. అంతే కాకుండా ఎదిటివారిని ఎలా వ‌శ‌ప‌రుచుకోవ‌చ్చో కూడా చాణ‌క్యుడు ఈ గ్రంథం ద్వారా తెలిపాడు. ఎదుటివారిని వ‌శ‌ప‌రుచుకునేందుకు చాణ‌క్యుడు కొన్ని నీతి సూత్రాల‌ను భోదించాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం…ప్ర‌ప‌చంలో ఎంతోమంది మ‌నుషులు ఉన్నారు. ఒక్కొక్క‌రి స్వ‌భావం ఒక్కోలా ఉంటుంది. అయితే అంద‌రితో మ‌న‌కు ప‌నిలేదు.

chanakya nithi

chanakya nithi

మ‌న‌కు ఎవ‌రితో అవ‌స‌రం ఉందో వారితో ప‌రిచ‌యం పెంచుకోవాలి. ప‌రిచ‌యం పెంచుకున్న త‌ర‌వాత స్వ‌భావం అంచ‌నా వేయాలి..కొంత మందికి కోపం ఎక్కువ‌గా ఉంటుంది. అలాంటి వారితో ప్ర‌శాంతంగా మెల‌గాలి. మీపై వాళ్లు కోప్ప‌డిగా ఆ కోపానికి గ‌ల కార‌ణాల‌ను మెల్లిగా స‌మయం చూసుకుని వారికి వివ‌రించాలి. వారి మందు కోపం గా గానీ వారి కోపానికి భ‌య‌ప‌డిన‌ట్టు కూడా ఉండ‌కూడ‌దు. శాంతంగా న‌వ్వుతూ వారిని వ‌శ‌ప‌రుచుకోవాలి. కొంత‌మందికి మూర్ఖ‌త్వం ఉంటుంది. అలాంటి వారిని ఎప్పుడూ పొగుడుతూ ఉండాలి. వారిని అనుక‌రిస్తున్న‌ట్టు చేసి స‌మ‌యం దొరికినప్పుడు వారి మూర్ఖ‌త్వం గురించి చెప్పాలి. ఒక్క‌సారి మూర్కంగా ఉండేవారు మ‌నల్ని న‌మ్మితే చెప్పింది చెప్పిన‌ట్టుగా చేసేస్తారు.

Advertisement

Advertisement

ALSO READ : రుద్రాక్ష‌ను ధ‌రించిన‌వాళ్లు త‌ప్ప‌కుండా పాటించాల్సిన నియ‌మాలు ఇవే…!

కొంత మందికి ఈగో ఎక్కువ‌గా ఉంటుంది. అలాంటి వారితో చాలా సౌమ్యంగా మాట్లాడాలి. వారి ముందు మ‌నం ఈగో చూపిస్తే మొద‌టికే మోసం వ‌స్తుంది. వారు ఎలా చెబితే అలా చేస్తూ మెళ్లిగా మ‌న‌దారిలోకి తెచ్చుకోవాలి. మీరు ప్ర‌తిభావంతుల‌ను గ‌న‌క క‌లిస్తే అలాంటి వారితో చాలా నిజాయితీగా ఉండాలి. వారు మాట్లాడే విష‌యాల్లో అవగాహ‌న ఉంటేనే మాట్లాడాలి. అప్పుడు మిమ్మ‌ల్ని న‌మ్ముతారు. అలాంటి వారితో స్నేహం చేయ‌డం వ‌ల్ల మీకు స‌మాజంలో గౌర‌వం ద‌క్కుతుంది. అత్యాశ ప‌రుల‌ను అయితే చాలా తేలిక‌గా వ‌శ‌ప‌రుచుకోవ‌చ్చు. మీ వద్ద ధ‌న ఉంటే చాలు. ఆ ధ‌నం ఆశ చూపిస్తే వ‌చ్చేస్తారు. కానీ అలాంటి వారితో మీరే జాగ్ర‌త్త‌గా ఉండాలి.

Visitors Are Also Reading