సాధారణంగా డబ్బు లేకుండా మనిషి జీవితం గడపడం అసాధ్యం. డబ్బు అనేది ప్రతి వ్యక్తికి మంచి చెడులకు మంచి గుర్తింపునిస్తోంది. చాణిక్య నీతి ప్రకారం డబ్బు విలువను అర్థం చేసుకున్న వ్యక్తి సంపన్నుడు అవుతాడు. సంపదను రక్షించుకోలేని వ్యక్తి సింహాసనం మీద నుంచి నేలపాలు నేల మీదకు దిగి రావాల్సిందే. సంపాదనను సంయమనంతో భద్రంగా ఉంచుకునే వ్యక్తుల దగ్గర సంపద అనేది వృద్ధి చెందుతుంది. ఉపయోగించుకోవడానికి ఆచార్య చాణిక్య కొన్ని మార్గాలను సూచించాడు. మార్గాలను అనుసరించేవారు సంక్షోభ సమయంలో కూడా సంతోషమైన జీవితాన్ని గడుపుతారు.
డబ్బులు భద్రగా దానధర్మం కోసం పెట్టుబడి కోసం ఉపయోగించే వ్యక్తి ఆపద సమయంలో కూడా నవ్వుతూ జీవితాన్ని గడుపుతాడు. సరైన స్థలం, సమయానికి అనుగుణంగా డబ్బును ఉపయోగించాలి. మంచ ఉన్నంత మాత్రాన అంత దూరం కాళ్లు చాచాల్సిన అవసరం లేదు. అనవసరంగా డబ్బు ఖర్చు చేసేవారు విపత్తులలో కష్టాలను పేదరికం ఎదుర్కోవాల్సి వస్తుంది. అనవసరమైన ఖర్చులకు డబ్బుని ఖర్చు చేయకుండా ఆదా చేయడం ఉత్తమం. డబ్బు ఎప్పుడూ ఎంత ఎక్కడ ఖర్చు చేయాలనే విషయాలను దృష్టిలో పెట్టుకొని ఖర్చు చేసేవారు ఇతరుల దృష్టిలో జిజ్ఞాసువులుగా నిలుస్తారు. కానీ అలాంటి వ్యక్తులే తమ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సాధారణమైన జీవితాన్ని గడుపుతారు.
Advertisement
Advertisement
ఆదాయంలో కొంత భాగాన్ని దానానికి వినియోగిస్తే ఆ వ్యక్తి సంపద రెట్టింపు అవుతుందని ఆచార్య చాణక్యుని నమ్మకం. దాన ధర్మాన్ని మించిన గొప్ప సంపద లేదు. పేదవాడికి తన శక్తి మేరకు సహాయం చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం కలకాలం నిలుస్తుంది. సమతుల ఆహారం మన శరీరాన్ని ఎంతకాలం ఆరోగ్యంగా ఉంచుతుందో అలాగే డబ్బుని ఖర్చు చేసే సమయంలో మనిషి సమతుల్యం చేసుకుంటే ఆపదలో కూడా డబ్బులు ఆదుకుంటాయి. డబ్బును చాలా జాగ్రత్తగా ఖర్చు చేయడం ఉత్తమం. చేయడం కోసం మీ అవసరాలను పరిమితం చేసుకోండి. మీకు అవసరమైన అంత మాత్రమే ఖర్చు చేయండి. ఆచార్య ప్రకారం.. అనవసరమైన ఖర్చులు చేసి అప్పుల పాలు కాకుండా జాగ్రత్తగా ఉండండి.
Also Read : విడాకులకు ప్రధాన కారణాలు ఇవేనట..!