ఆచార్య చాణక్యుడు రచించిన నీతి శాస్త్రాన్ని ఇప్పటికీ చాలా మంది అనుసరిస్తున్నారు. ఈ నీతి శాస్త్రంలో సమాజానికి సంబంధించిన పలు విషయాలను చాణక్యుడు ప్రస్తావించాడు. ఒక మనిషి జీవితంలో ఎలాంటి నిర్ణయాలను తీసుకోవాలి. ఎలాంటి మార్గంలో వెళ్లాలి అనేటటువంటి తదితర విషయాలను ఆ నీతి శాస్త్రంలో చెప్పాడు. చాణక్య నీతి ప్రకారం.. జీవితంలో జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడం అత్యంత ముఖ్యమైన నిర్ణయం. ఆ నిర్ణయం తప్పు అయితే జీవితాంతం బాధపడాల్సిందే.
Advertisement
స్త్రీలు, పురుషులు తమకు తాముగా జీవిత భాగస్వామిని ఎంచుకుంటుంటారు. ప్రతీ విషయంలో ఉత్తమంగా ఉండాలని కోరుకుంటారు. సాధారణంగా స్త్రీలు తన కాబోయే భర్త ప్రశాంత స్వభావాన్ని కలిగి ఉండాలని కోరుకుంటారు. ఎవరైనా తక్కువ మాట్లాడితే అతని లక్షణాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. అలాంటి పురుషుల పట్ల స్త్రీలు త్వరగా ఆకర్షితులు అవుతారు. అతడు జీవిత భాగస్వామిగా ఎంచుకోవాలని నిర్ణయించుకుంటారని చాణక్య చెబుతున్నాడు. స్త్రీలు పురుషులు తమ జీవిత భాగస్వామి అందంగా కనిపించాలని కోరుకుంటారు. చాలా మంది స్త్రీలు పురుషుల వ్యక్తిత్వం పై ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఒక మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటే అతని గొప్ప గుణం అని నిరూపించవచ్చు.
Advertisement
Also Read : Chanakya Niti : ఈ మూడు లక్షణాలు కలిగిన స్త్రీలు కుటుంబంలో సంతోషం లేకుండా చేస్తారట..!
స్త్రీలు అత్యాశ లేదా అహంకార స్వభావం కలిగి ఉన్న పురుషులకు దూరంగా ఉండడానికి ఇష్టపడతారు. స్త్రీలు నిజాయితీగా విధేయతతో ఉన్న వారిని ఎక్కువగా ఇష్టపడుతారు. అలాంటి వారినే జీవిత భాగస్వామిగా ఎంచుకుంటారు. పురుషులే కాదు..మహిళలు కూడా మంచి జీవిత భాగస్వామిని కోరుకుంటారు. ఎల్లప్పుడూ సహాయం చేసే గుణం ఉన్న వారిని ఇష్టపడతారు. చాలా మంది స్త్రీలు నీచంగా ఉండే పురుషులను ద్వేషిస్తారు. ఎల్లప్పుడూ ఇతరులకు చెడు చేసే వ్యక్తులకు దూరంగా ఉండాలని కోరుకుంటారు. మనిషికి సహాయం చేసే గుణం ఉండాలి.
Also Read : Chanakya Niti : భార్య భర్తల మధ్య ప్రేమ ఉండాలంటే ఇవి తప్పకుండా పాటించాలి..!